Handwara narco-terror case: పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. సస్పెండైన అధికారి పొలంలో డంప్..
Handwara Narco-Terror Case Investigation: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నార్కో టెర్రరిజం కేసు విచారణలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో శుక్రవారం..
Handwara Narco-Terror Case Investigation: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నార్కో టెర్రరిజం కేసు విచారణలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో శుక్రవారం జరిపిన తనిఖీల్లో 91 లక్షల విలువచేసే మాదకద్రవ్యాలు వెలుగులోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్ పరిధిలోని సాంబా జిల్లా గుర్వాల్ గ్రామంలో తొలగించిన పోలీసు అధికారి పొలంలో దాచి ఉంచిన రూ.91 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూన్ 11వతేదీన కుప్వారా జిల్లా హింద్వారా పోలీసుస్టేషన్ పరిధిలోని కైరో బ్రిడ్జి వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. రూ.20 లక్షలు విలువచేసే రెండు కిలోల హెరాయిన్ లభించింది. అప్పట్లో అబ్దుల్ మోమిన్ పీర్ వాహనంలో డ్రగ్స్ తీసుకువెళుతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఈ కేసులో దర్యాప్తు చేయగా బీఎస్ఎఫ్ అధికారి రోమేష్ కుమార్ హస్తం ఉన్నట్లు తేలడంతో ఆయన్ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు ముందు సస్పెండైన అధికారి తన పొలంలో ఈ డ్రగ్స్‌ను దాచిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. దీంతో అధికారులు గుర్వాల్ గ్రామంలోని రోమేష్ కుమార్ పొలంలో తనిఖీలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. స్మగ్లర్లు రహస్యంగా డ్రగ్స్‌ను కశ్మీరు లోయలో విక్రయిస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతోపాటు రొమేష్ కుమార్‌కి ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని బట్టబయలైంది.
Also Read: