Cyber Frauds: కొత్త మార్గాల్లో సైబర్‌ నేరాలు.. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కే ఎసరు!

సాధారణంగా సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి కొన్ని తెలిసిన పద్ధతులను అనుసరిస్తారు. ఒకటి కొరియర్ ఫ్రాడ్ మరొకటి డిజిటల్ అరెస్ట్ ఈ రెండు స్కీం లను ఉపయోగించి రెసెంట్ గా ఎన్నో కోట్ల రూపాయలు దోచుకున్నారు..

Cyber Frauds: కొత్త మార్గాల్లో సైబర్‌ నేరాలు.. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930కే ఎసరు!
Follow us
Vijay Saatha

| Edited By: Subhash Goud

Updated on: Nov 28, 2024 | 9:09 PM

సైబర్ నేరస్తులు రోజు రోజుకి పెట్రేగి పోతూ సొమ్ము కాజేయడమే పరమా వధిగా ఉంటున్నారు. అలాంటి సైబర్ నేరగాళ్లకి అడ్డు కట్టు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1930 లాంటి టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కొద్దిలో కొంచెమైనా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం సైబర్ నేరగాళ్లు నేరానికి వినియోగిస్తున్నారు .

సాధారణంగా సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి కొన్ని తెలిసిన పద్ధతులను అనుసరిస్తారు. ఒకటి కొరియర్ ఫ్రాడ్ మరొకటి డిజిటల్ అరెస్ట్ ఈ రెండు స్కీం లను ఉపయోగించి రెసెంట్ గా ఎన్నో కోట్ల రూపాయలు దోచుకున్నారు . ముందుగా మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చిందంటూ నమ్మిస్తారు. ఆ పార్శిల్ లో అనుమాన్పద వస్తువులు ఉన్నాయని నమ్మిస్టారు. డ్రగ్స్, వెపెన్స్, పాస్ పోర్ట్‌లు ఉన్నాయని భయపెట్టి మభ్య పెడుతారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు, వారీ నేరాలపై ముందుగానే అవగాహన ఉంటే వెంటనే బాధితుడు అలెర్ట్ అవుతాడు.

వెంటనే బాధితుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని చెప్తే ఆ అవసరం మీకు లేదు మేమే 1930 కు కాల్ కలుపుతాం అంటు నమ్మించి మరి సైబర్ నెరస్తుడిని లైన్‌లో పెట్టి వారే పోలీసులు లాగా నటిస్తూ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారు. ఇలా ఇటీవల 1930 పేరు చెప్పి కూడా నేరాల కు పాల్పడుతున్నారు .

డిజిటల్ అరెస్ట్‌ల రూపంలో ఎన్నో వందల కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ లపై కేంద్ర ప్రభుత్వం సైతం అవగాహన కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. డిజిటల్ అరెస్టుల రూపంలో బాధితులుగా ఉన్నవారు దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ యూనిఫామ్ ధరించి ముంబై పోలీస్ లోగోని వెనకాల పెట్టి కేవలం స్కైప్ కాల్‌లో మాట్లాడి బాధితుడుని మాటల్లో పెట్టి ఏదో పెద్ద నేరం జరిగిందని వారిని నమ్మించి వారికి సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నారు సైబర్ నేరస్తులు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకుతెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఇప్పటికే ఇతర రాష్ట్రానికి వెళ్లి అనేకమంది నిందితులను అరెస్ట్ చేసి తెలంగాణకు తీసుకొస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?