Crime News: తమిళనాడులో దారుణం.. వర్షపు నీటిలో చిక్కుకొని ప్రభుత్వ వైద్యురాలి మృతి

Crime News: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వర్షపునీటిలో చిక్కుకొని ఓ ప్రభుత్వ వైద్యురాలు దిక్కు తోచని స్థితిలో మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల

Crime News: తమిళనాడులో దారుణం.. వర్షపు నీటిలో చిక్కుకొని ప్రభుత్వ వైద్యురాలి మృతి
Tamil Nadu Rains
Follow us
uppula Raju

|

Updated on: Sep 19, 2021 | 1:21 PM

Crime News: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వర్షపునీటిలో చిక్కుకొని ఓ ప్రభుత్వ వైద్యురాలు దిక్కు తోచని స్థితిలో మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుక్కోట జిల్లా తురైయూర్‌ పరిధికి చెందిన శివకుమార్‌, సత్య(35) దంపతులు. కృష్ణగిరి జిల్లా హోసూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సత్య వైద్యురాలిగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అత్తగారితో కలిసి ఆమె కారులో తురైయూర్‌కు బయలుదేరారు. తురైయూర్‌ సమీపానికి చేరుకోగానే భారీ వర్షం మొదలైంది. దీంతో అక్కడ ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద భారీగా వాననీరు చేరింది.

దీంతో ఆ మార్గాన వెళుతున్న వారి కారు వర్షపు నీటిలో చిక్కుకుంది. ముందుకు వెనుకకు వెళ్లడానికి వీలు లేకుండా అక్కడే ఉండిపోయింది. మరో వైపు భారీ వర్షం కారణంగా మెల్లగా నీరు పెరిగిపోతుంది. కారులో ఉన్న సత్యకి ఏం చేయాలో తోచడం లేదు. వెంటనే వెనుక సీటులో కూర్చున్న అత్తగారు కారు నుంచి దిగి మెల్లగా బయటికి వచ్చారు. కానీ డ్రైవింగ్‌ సీటులో ఉన్న సత్య సీటుబెల్టు లాక్‌ అవడంతో బయటకురాలేకపోయింది.

చాలాసేపు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రాణాలు వదిలింది. ఎవరైనా వచ్చి తమ కోడలుని కాపాడుతారని ఎదురుచూసిన అత్త ఆశలు అడియాశలయ్యాయి. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సత్య చనిపోయిందని, అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలుస్తుందని ఎన్నిసార్లు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరదనీటికి ఒక నిండు ప్రాణం బలికావడం అందరిని కలిచివేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి