Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు..
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్‌టెక్, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాగాజ ఝార్ఖండ్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గోవింద్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో హింద్ హోటల్ సమీపంలో ఉన్న వంతెన వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టి వంద మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని భావిస్తున్నారు పోలీసులు.
ఘటన స్థలంలో లభించిన ఆధార్ కార్డు వివరాల ఆధారంగా.. మృతదేహాలను గుర్తిస్తున్నారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకు తీశారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులంతా రాయ్‌గఢ్ నుంచి అనసోల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: