జమ్ము ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. టికెట్ కౌంటర్ దగ్ధం
జమ్ముకశ్మీర్‌లోని జమ్ము ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ తెల్లవారుజామున విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలతో ఎయిర్‌పోర్టులోని టికెట్ కౌంటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.

జమ్ముకశ్మీర్‌లోని జమ్ము ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ తెల్లవారుజామున విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలతో ఎయిర్‌పోర్టులోని టికెట్ కౌంటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఓ టికెట్ కౌంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, అవి మిగిలినవాటికి వ్యాపించాయని అధికారులు తెలిపారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలను ఆర్పడానికి 45 నిమిషాల సమయం పట్టిందని సత్వారీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఒక్కరుకూడా గాయపడలేదని చెప్పారు.
ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. టికెట్ కౌంటర్లో మంటలు చెలరేగాయని, గంట వ్యవధిలోనే అవి అదుపులోకి వచ్చాయని జమ్ము ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ప్రవంత్ రంజన్ తెలిపారు. అయితే, విమాన సర్వీలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని, సర్వీసులను యదావిధంగా నడిపామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసుకున్న సత్వారీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Fire at Jammu airport damages ticket countershttps://t.co/ZHpLEIHu5A
— Hindustan Times (@HindustanTimes) October 29, 2020




