AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్తుతెలియని మహిళను గొంతు కోసి చంపిన దుండగులు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఓ వివాహిత మహిళ (30) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన చనుగోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

గుర్తుతెలియని మహిళను గొంతు కోసి చంపిన దుండగులు
Balaraju Goud
|

Updated on: Oct 29, 2020 | 11:26 AM

Share

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఓ వివాహిత మహిళ (30) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన చనుగోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌-బీజాపూరు హైవే రోడ్డు రాకంచర్ల ఇండస్ట్రియల్‌ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. హత్య చేసిన మహిళను హైవే రోడ్డు కల్వర్టు దగ్గర ఉన్న నీటి కుంటలో పడేసి వెళ్లారు దుండగులు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఒంటిపై ఆరంజ్‌ కలర్‌ స్కర్ట్‌, బ్లాక్‌ కలర్‌ టాప్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. జరిగిన ఘటన తెలుసుకున్న పరిగి డీఎస్పీ సందర్శించి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Follow Us
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!