కరోనా వేళ.. గ్రౌండ్‌లో కబడ్డీ ఫైట్..రంగంలోకి దిగిన పోలీసులు

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో బయపడుతూ.. ఇళ్లకే పరిమితమై ఉంటే.. మరికొందరు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక మరికొందరు పిల్లలు హాలీడేస్‌లా భావిస్తూ.. గల్లీల్లో ఆటలాడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఘర్షణలకు కూడా దిగుతున్నారు. తాజాగా యూపీలోని మొరదాబాద్‌లో చిన్న పిల్లలు ఆడకుంటున్న కబడ్డీ ఆట.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మొర‌దాబాద్‌లో కొంత‌మంది పిల్ల‌లు క‌బ‌డ్డీ ఆడుకుంటూ.. చిన్న విషయంలో గొడవకు […]

కరోనా వేళ.. గ్రౌండ్‌లో కబడ్డీ ఫైట్..రంగంలోకి దిగిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 5:16 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో బయపడుతూ.. ఇళ్లకే పరిమితమై ఉంటే.. మరికొందరు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక మరికొందరు పిల్లలు హాలీడేస్‌లా భావిస్తూ.. గల్లీల్లో ఆటలాడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఘర్షణలకు కూడా దిగుతున్నారు. తాజాగా యూపీలోని మొరదాబాద్‌లో చిన్న పిల్లలు ఆడకుంటున్న కబడ్డీ ఆట.. రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మొర‌దాబాద్‌లో కొంత‌మంది పిల్ల‌లు క‌బ‌డ్డీ ఆడుకుంటూ.. చిన్న విషయంలో గొడవకు దిగారు. ఆ విష‌యం కాస్తా వారి త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు చేర‌డంతో.. పిల్ల‌ల కుటుంబ‌స‌భ్యులు కూడా ఫైట్‌కు దిగారు. అయితే ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మ‌జ్ హోలా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కాశీరాం కాల‌నీలో ఈ గొడ‌వ చోటుచేసుకుంది. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా ఇలాంటీ సీన్ రిపీట్ అయ్యింది. కొందరు యువకులు క్రికెట్ ఆడుకుంటూ.. రెండు గ్రూపులుగా విడిపోయి.. తలలు పగులగొట్టుకున్నారు.