లాక్‌డౌన్ వేళ.. స్మశానం అడ్డాగా.. మందుబాబుల హవా..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో బెంగళూరులోని మందుబాబులు పార్టీలు చేసుకొనేందుకు ఓ సరికొత్త ప్రదేశాన్ని ఎంచుకున్నారు. నగరంలోని స్మశానాలను అడ్డాలుగా

లాక్‌డౌన్ వేళ.. స్మశానం అడ్డాగా.. మందుబాబుల హవా..!
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 1:08 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో బెంగళూరులోని మందుబాబులు పార్టీలు చేసుకొనేందుకు ఓ సరికొత్త ప్రదేశాన్ని ఎంచుకున్నారు. నగరంలోని స్మశానాలను అడ్డాలుగా మార్చుకొని.. వాళ్లు పార్టీలు చేసుకుంటున్నారు. తాగిన వ్యక్తులు తిన్నగా ఉండకుండా గొడవలకు దిగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

వివరాల్లోకెళితే.. శాంతినగర్ ప్రాంతంలోని స్మశానంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడటంతో.. అతను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌లోని అక్కితిమనహళ్లికి చెందిన సురేశ్ అబాస్తీ, అతని స్నేహితుడు అప్పు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బీర్లతో స్థానిక స్మశానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ నలుగురు వ్యక్తులు ఫుల్‌గా పార్టీ చేసుకుంటున్నారు. అక్కడకు వచ్చిన సురేశ్, అప్పులను వాళ్లు వెళ్లిపోమన్నారు.

కాగా.. తాము ఓ మూల కూర్చొని పార్టీ చేసుకొని.. వెళ్లిపోతామని సురేశ్, అప్పులు తెలిపారు. దీంతో నలుగురిలో ఒకడైన పార్తీబన్ అనే వ్యక్తి కోపంతో వారిపై దాడికి దిగాడు. కత్తితో అతను సురేశ్ తలపై, చేతులపై దాడి చేశాడు. మిగితా ముగ్గురు కూడా వీరిద్దరిపై కర్రలతో దాడి చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్పు.. తన స్నేహితులు సురేశ్‌ను తీసుకొని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

మరోవైపు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లాక్‌డౌన్ సమయంలో స్మశానంలో అసాంఘిక పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. కొందరు స్మశానంలో పార్టీలు చేసుకోవడమే కాక.. తమ ఆయుధాలను కూడా దాస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Latest Articles