ఢిల్లీలో మారిన వాతావరణం.. ఓ వైపు దుమ్ము, ధూళీ.. మరోవైపు వర్షం..

దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తితో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ఇంకోవైపు వణికిస్తోంది. తాజాగా ఆదివారం ఉదయం నుంచి అక్కడి వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. ఓ వైపు దుమ్ము, ధూళీతో రోడ్లన్నీ కనిపించకుండా పోతుంటే.. మరోవైపు భారీ ఈదురుగాలులతో వర్షం కూడా పడుతోంది. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము, ధూళీ వీస్తుండటంతో.. వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నారు. అటు సామాన్య ప్రజానీకం […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:07 pm, Sun, 10 May 20
ఢిల్లీలో మారిన వాతావరణం.. ఓ వైపు దుమ్ము, ధూళీ.. మరోవైపు వర్షం..

దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తితో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ఇంకోవైపు వణికిస్తోంది. తాజాగా ఆదివారం ఉదయం నుంచి అక్కడి వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. ఓ వైపు దుమ్ము, ధూళీతో రోడ్లన్నీ కనిపించకుండా పోతుంటే.. మరోవైపు భారీ ఈదురుగాలులతో వర్షం కూడా పడుతోంది. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము, ధూళీ వీస్తుండటంతో.. వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నారు. అటు సామాన్య ప్రజానీకం కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. మరోవైపు పలుచోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతోంది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి.
ఘజియాపూర్ ఫ్లై ఓవర్‌పై మధ్యాహ్న సమయంలో కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వసంత విహార్ ప్రాంతంలోని రోడ్లన్నీ దుమ్ము, ధూళీతో కప్పేయబడ్డాయి.