Fake Passport: నకిలీ పాస్‌పోర్ట్ తయారీ ముఠా గుట్టురట్టు.. ప్రధాన నిందితుడితో సహా 11మంది అరెస్ట్
పదేళ్ల తర్వాత తెలంగాణలో మొదటి సారిగా సీఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. కోరుట్ల కేంద్రంగా నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు ఇప్పిస్తోన్న ముఠా గుట్టరట్టు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ముగ్గురు పాస్ పోర్ట్ ఏజెంట్ల ఇళ్ళల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
పదేళ్ల తర్వాత తెలంగాణలో మొదటి సారిగా సీఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. కోరుట్ల కేంద్రంగా నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు ఇప్పిస్తోన్న ముఠా గుట్టరట్టు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ముగ్గురు పాస్ పోర్ట్ ఏజెంట్ల ఇళ్ళల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది సభ్యుల ముఠాను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 సెల్‌ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సీఐడీ కార్యాలయంలో నమోదైన కేసు ఆధారంగా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో సోదాలు నిర్వహించారు. కోరుట్లలోని రాంనగర్‌లోని అశోక్, సంగెం రోడ్డులోని కమురొద్దీన్, ఐబీ రోడ్డులోని చాంద్ ఖాన్ ఇళ్ళపై ఏకకాలంలో సీఐడీ అధికారులు దాడు చేశారు. నలుగురు సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణలో మూడు టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి.
నిందితుల వద్ద నకిలీ పాస్ పోర్టులు, అవి తయారు చేయడానికి ఉపయోగించే సామాగ్రితోపాటు, నకిలీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విదేశీయులకు పాస్‌పోర్టులు వచ్చేలా ఈ ముఠా నకిలీ ఆధార్ కార్డు, ఓటరు కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు తయారు చేస్తోంది. వాటి ఆధారంగా పాస్‌పోర్టు స్లాట్‌లు బుక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వందల మంది విదేశీయులకు నిందితులు పాస్‌పోర్టులు అందించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరి తోపాటు మరో 11 మందిని సీఐడీ బృందం అరెస్టు చేసింది. ఎక్కువగా శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు ఈ ముఠా పాస్‌పోర్టులు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..