Molestation: ఫిర్యాదు చేయడానికి పోలీసును ఆశ్రయిస్తే.. 40 రోజులు బంధించి నరకం చూపించాడు..

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల్లో ( Police) కొందరు భక్షకులుగా మారుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆకృత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు

Molestation: ఫిర్యాదు చేయడానికి పోలీసును ఆశ్రయిస్తే.. 40 రోజులు బంధించి నరకం చూపించాడు..
Follow us
Basha Shek

|

Updated on: Feb 06, 2022 | 9:29 AM

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల్లో ( Police) కొందరు భక్షకులుగా మారుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆకృత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చెన్నై(Chennai) కు చెందిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కూడా ఇలాగే క్రూరంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని 40 రోజుల పాటు ఓ చీకటి గదిలో బంధించి 40 రోజుల పాటు చూపించాడు. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ ఇన్‌స్పెక్టర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని పళ్లికరణైకు చెందిన ఓ యువతి గతంలో మిస్‌ చెన్నై అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. కాగా విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటోన్న ఆమెకు ఈస్ట్‌ కోస్టు రోడ్డులో కొంచెం స్థలం ఉంది. అక్కడ ఆమెకు ఇల్లు నిర్మిస్తానని చెప్పి ఓ బిల్డర్‌ ఆమెను మోసం చేశాడు.

దుష్ణ నివారణ పూజల పేరుతో.. దీంతో తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సమయంలో ఎస్‌ఎస్‌ఐ ఆండ్రు కార్వెల్‌తో పరిచయం ఏర్పడింది. కేసు విచారణ పేరిట తరచూ ఆమెను స్టేషన్‌కు పిలిపించేవాడు. ఇదే సమయంలో ఆయువతి తన సమస్యలను కార్వెల్‌తో చెప్పింది. తన తల్లిదండ్రులు చనిపోయారని, తన ఇంట్లో సమస్యలున్నాయని అతని వద్ద వాపోయింది. ఇదే అదునుగా తీసుకున్న కార్వెల్‌ ఆమె ఇంట్లో కొన్ని దుష్ణ నివారణ పూజలు, ప్రార్థనలు చేయించాలని కొందరు మత బోధకులను రంగంలోకి దించాడు. కొద్దిరోజుల పాటు తన తల్లి, సోదరిని కూడా ఆమె ఇంటికి తీసుకొచ్చాడు. అయితే వారందరూ వెళ్లిపోయిన తర్వాత ఎస్‌ఐ బాధితురాలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. లైంగికంగా వేధించాడు. అలా సుమారు 40 రోజుల పాటు గదిలో నరకం చూశానని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో వాపోయింది. కాగా తెలిసిన వారి సాయంతో అక్కడి నుంచి బయటపడిన యువతి మొదట కార్వెల్‌ కుటుంబ సభ్యులను కలిసింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎస్‌ఐతో వివాహం జరిపిస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం న్యాయం కోసం యువతి పోలీసులను ఆశ్రయించింది. కాగా బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌ఎస్‌ఐ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కేసు నమోదుచేసిన పళ్లికరణై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Also Read:Cheating: ఓటీపీతో రూ.2.79 లక్షలు ఫట్‌.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో నిలువునా మోసపోయిన వ్యాపారి.. Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్‌?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్‌ హీరోయిన్‌ నాటీ కామెంట్‌..

Nayanthara: నయన్‌ను మిస్‌ అవుతున్నానంటోన్న విఘ్నేశ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్‌..