Nizamabad: డిప్యూటీ తహసీల్దార్ అమానుషం.. యాచకుడిని కాలుతో తన్నడంతో లారీ కింద పడి మృతి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ తహసీల్దార్ ఓవరాక్షన్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆర్మూర్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొని నిజాంసాగర్ కెనాల్ ప్రాంతానికి చెందిన శివరాం అనే యాచకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్ వద్ద ఆగిన కార్ల అద్దాలు తుడుస్తూ.. డబ్బులు యాచిస్తూ శివరాం అనే వ్యక్తి జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 22న సాయంత్రం సిగ్నల్ వద్దకు వచ్చిన మెండోరా మండల డిప్యూటీ తహశీల్దార్ రాజశేఖర్ కారు ఆగింది. అదే సమయంలో శివరాం రోజూ చేసే పనిలో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ కారు అద్దాలను క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరాడు. అయితే.. రాజశేఖర్ మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు.
ఇంతలోనే.. సిగ్నల్ పడటంతో రాజశేఖర్ తన కారును ముందుకు పోనిచ్చాడు. అయితే.. డబ్బులు ఇస్తాడేమో అన్న ఆశతో కారు వెంటే శివరాం పరుగులు తీశాడు. అది చూసి తీవ్ర అసహాసనానికి గురైన రాజశేఖర్.. కారు ఆపి మరీ, శివరాంను కాలితో తన్నాడు. దీంతో అదుపు తప్పిన శివరాం.. తూలుతూ వెళ్లి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వచ్చిన టిప్పర్ శివరాం పైనుంచి వెళ్లాయి. దీంతో యాచకుడు శివరాం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. అక్కడే ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేశారు. మెండోరా డిప్యూటీ తహశీల్దార్ అమానుష చర్య బయటపడటంతో అదుపులోకి తీసుకున్నారు ఆర్మూర్ పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…