నిర్భయ: దేశ చరిత్రలోనే ప్రథమం…చివరి క్షణం వరకు ఉత్కంఠ

చరిత్రలోనే ఇది సంచలనం. నిర్భ‌య దోషుల‌ ఉరి దేశ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేకమైనదిగా మిగిలి పోయింది. ఒకేసారి నలుగురు దోషులను ఉరితీసిన సంఘటనపై ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిర్భయ: దేశ చరిత్రలోనే ప్రథమం...చివరి క్షణం వరకు ఉత్కంఠ
Follow us

|

Updated on: Mar 20, 2020 | 9:47 AM

చరిత్రలోనే ఇది సంచలనం. నిర్భ‌య దోషుల‌ ఉరి దేశ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేకమైనదిగా మిగిలి పోయింది. ఒకేసారి నలుగురు దోషులను ఉరితీసిన సంఘటనపై ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎనిమిది సంవ‌త్స‌రాలుగా వార్త‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన నిర్భ‌య దోషుల‌కు ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం ఉద‌యం ఉరి శిక్ష అమ‌లు చేయ‌డంతో సంబ‌రాలు నెలకొన్నాయి. నిర్భయ కుటుంబ స‌భ్యులు, బంధువులు, అభిమానులు ఉద‌య‌మే తిహార్ జైలు ద‌గ్గ‌ర సంబ‌రాలు చేసుకున్నారు. ఇక మీర‌ట్ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక త‌లారి వీరు న‌లుగురికి ఉరి శిక్ష అమ‌లు చేశారు.

2012 డిసెంబర్ నెలలో నిర్భయపై ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారం చేశారు. ఓ పారా మెడికల్ విద్యార్థిని కదులుతున్న బస్సులో అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు నిర్భయ మరణించింది. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఆరుగురు నిందితులను పోలీసులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఇందులో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో మలుపులు… ఎన్నో చర్చల తర్వాత వీరికి ఎట్టకేలకు ఉరి శిక్ష అమలు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు శిక్ష అనుభవించారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ బస్సు డ్రైవర్ రామ్ సింగ్ 2013లో జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చినా నిన్నటి వరకు ఉరితీయలేదు.

గతంలో రెండుసార్లు డెత్ వారెంట్ రిలీజ్ చేసినా, చట్టంలోని లొసుగులు వినియోగించుకొని తప్పించుకునే ప్రయత్నం చేశారు. చట్టప్రకారం అన్ని అవకాశాలు వినియోగించుకున్నా మూడోసారి కూడా తప్పించుకోవాలని చూశారు. కోర్టు కఠినంగా వ్యవహరించి పాటియాలా కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ను అమలు చేయాలనీ తీర్పునిచ్చింది. దీంతో దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో ఇవాళ(20 మార్చి 2020) తెల్లవారుజామున 5గంటల 30నిమిషఆలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌ కేంద్ర కారాగారంలో మూడవ నంబర్ గదిలో నలుగురిని ఒకేసారి ఉరి తీశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

అయితే నిర్భయ దోషులకు ఉరి తీసే ముందు.. వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు ఐదు నుంచి పది నిమిషాలు అనుమతివ్వాలని వీరి తరఫున ముందు నుంచి వాదిస్తున్న న్యాయవాది ఏపి. సింగ్‌ కోరారు. అయితే దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ‌తా స్పందిస్తూ ఇందుకు నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని స్పష్టం చేశారు. ఇక సుప్రీం తీర్పు త‌ర్వాత ఉరి శిక్ష‌ పట్ల హర్షం నిర్భ‌య త‌ల్లి ఆషాదేవి హ‌ర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష తో తన కుమార్తె ఆత్మకు శాంతి చేకూరింద‌ని ఆమె చెప్పారు. నిర్భయ తండ్రి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.