నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవనే సరైన వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు భావించారు. పవన్‌‌ ఇంతకు ముందే ఉరి తీశాడు. దీంతో ఆయనకు అనుభవం ఉంది. అందులోనూ శారీరకంగా బలిష్ఠంగా...

  • Tv9 Telugu
  • Publish Date - 8:24 pm, Thu, 19 March 20
నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

నిర్భయ దోషులకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలివున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు తీహార్‌ జైలులో దోషులను ఉరి తీయనున్నారు. డెత్‌ వారెంట్‌ నిలిపివేయాలంటూ వారు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. కాగా నిర్భయ సామూహిక అత్యాచార దోషులకు.. ఉరితీసే అవకాశం ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌కు చెందిన పవన్ జల్లాడ్‌కు దక్కింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులోని నలుగురు నిందితులను ఉరితీసేందుకు ప్రభుత్వం పవన్ జల్లాడ్‌ని ఎందుకు ఎంచుకుంది? అసలు అతను ఎవరు? అలాగే ఉరిశిక్ష అమలు చేసినందుకు అతనికిచ్చే పారితోషికం ఎంత? అనేది మీకు తెలుసా..!

పవన్‌ని ఎందుకు ఎంచుకున్నారంటే?

నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవనే సరైన వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు భావించారు. పవన్‌‌ ఇంతకు ముందే ఉరి తీశాడు. దీంతో ఆయనకు అనుభవం కూడా ఉంది. అందులోనూ శారీరకంగా బలిష్ఠంగా ఉంటాడు. అలాగే అతని పూర్వీకులు కూడా తలారీలే కావటం వల్ల ఎలాంటి తప్పిదాలు దొర్లవు. అలాగే నిర్భయ దోషులను ఉరి తీసేందుకు పవన్ అర్జీ పెట్టుకోగా.. ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖ కూడా అంగీకరించింది.

ఇక పారితోషికం ఎంతంటే?

దోషులను ఉరివేస్తే తలారిలకు ప్రభుత్వం ఎంతో కొంత పారితోషికం ఇస్తుందనే సందేహం సాధారణంగా ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక దోషిని ఉరివేస్తే.. రూ.25 వేలు చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే నిర్భయ దోషులు నలుగురికి మరణశిక్ష అమలుపరిస్తే పవన్‌కి లక్ష రూపాయలు పారితోషికంగా లభిస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్భయ దోషులను ఉరి వేసే అవకాశం రావాలని పవన్ జల్లాడ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. అలాగే తలారిగా ఎంపికైన వెంటనే ఉత్తర్‌ ప్రదేశ్ జైళ్ల శాఖకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

Read More this also:

 జబర్దస్త్ నుంచి బయటకు పంపించేస్తే.. నేను ఇది చేయడానికి సిద్ధం

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..