Delhi Police: ఢిల్లీ పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్… పాతికేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న లాంబా
పాతికేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్ అజయ్ లాంబాను ఎట్టకేలకు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్యలు చేసి, వారి కార్లను దోచుకెళ్లడమే ఈ కిల్లర్ మోటివ్. సుమారు 24 ఏళ్ల క్రితం ఢిల్లీ...

పాతికేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్ అజయ్ లాంబాను ఎట్టకేలకు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్యలు చేసి, వారి కార్లను దోచుకెళ్లడమే ఈ కిల్లర్ మోటివ్. సుమారు 24 ఏళ్ల క్రితం ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగు దోపిడీ, హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడు.
అజయ్ లాంబా నేరాలకు పాల్పడే పద్ధతి చాలా సులభంగా ఉంటుంది. ఉత్తరాఖండ్‌కు వెళ్లడానికి టాక్సీని అద్దెకు తీసుకుంటాడు. ఆ తర్వాత డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి, హత్య చేస్తాడు. మృతదేహాన్ని పారవేసి, కారును అక్రమంగా నేపాల్ సరిహద్దు దాటించి విక్రయిస్తాడు. కానీ ఎప్పుడూ దొరకలేదు! ఇలా 2001లో నాలుగు హత్యలు ఆ తర్వాత మరికొన్ని చోరీలు, హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి అజయ్ బంగా పరారీలో ఉన్నాడు.
48 ఏళ్ల అజయ్ లంబా స్వస్థలం ఢిల్లీ. ఆరో తరగతి వరకు చదివిన అజయ్ లంబా.. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఓ ఇద్దర్ని హతమార్చినట్లు తేలింది. అతడు 2008 నుంచి 2018 వరకు నేపాల్ లో ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్ కు మకాం మార్చాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత సీరియల్ కిల్లర్ అజయ్ లంబా చిక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.