ఆర్టీసీ డ్రైవర్ ఇంటి వాటర్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ కలకలం
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆర్టీసీ డ్రైవర్ ఇంటి వాటర్ ట్యాంక్‌లో మృతదేహం వెలుగుచూసింది. ఒంటిపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్థారించారు. నంద్యాల దేవనగర్‌లోని ఆర్టీసీ డ్రైవర్ అల్లా భాకాస్ ఇంటి వాటర్ ట్యాంక్ లో మృతదేహం బయటపడ్డం ఇంట్లోని వాళ్లని ఒక్కసారిగా గగుర్పాటుకు గురిచేయడమేకాదు, స్థానికంగానూ కలకలం రేపింది. ఇంటి కుళాయిలో నీళ్లు రాకపోవడంతో ప్లంబర్ ని పిలిపించి చెక్ చేయించాడు ఇంటి ఓనర్. అయితే […]
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆర్టీసీ డ్రైవర్ ఇంటి వాటర్ ట్యాంక్‌లో మృతదేహం వెలుగుచూసింది. ఒంటిపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్థారించారు. నంద్యాల దేవనగర్‌లోని ఆర్టీసీ డ్రైవర్ అల్లా భాకాస్ ఇంటి వాటర్ ట్యాంక్ లో మృతదేహం బయటపడ్డం ఇంట్లోని వాళ్లని ఒక్కసారిగా గగుర్పాటుకు గురిచేయడమేకాదు, స్థానికంగానూ కలకలం రేపింది. ఇంటి కుళాయిలో నీళ్లు రాకపోవడంతో ప్లంబర్ ని పిలిపించి చెక్ చేయించాడు ఇంటి ఓనర్. అయితే ప్లంబర్ వాటర్‌ట్యాంక్‌లో చూడటంతో మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటర్ ట్యాంక్ డెడ్‌బాడీ కేసును నంద్యాలలోని త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు ? హత్య చేసింది ఎవరు ? డెడ్‌బాడీని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? అనే వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ హత్య నంద్యాలలో సంచలనం రేపుతోంది.