లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన బోధన్ పట్టణ సీఐ
బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సీఐ రాకేష్ గౌడ్, కానిస్టేబుల్ గజేందర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సీఐ రాకేష్ గౌడ్, కానిస్టేబుల్ గజేందర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..సాజిద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి, జగదీశ్వర్ గౌడ్ అనే వ్యక్తికి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు ఇరువురుపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సాజిద్ బైక్‌ను సీఐ స్టేషన్ కు తీసుకువచ్చారు. బండి ఇవ్వాలన్నా, కేసు లేకుండా చేయాలన్నా లక్ష రూపాయల సెల్ ఫోన్‌తో పాటు యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సాజిద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టణ సీఐ రాకేష్ గౌడ్, కానిస్టేబుల్ గజేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పథకం ప్రకారం దాడిచేసి నిందితులను పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ రవి కూమార్ చెప్పారు. వీరి దగ్గర నుండి 50 వేల నగదు, లక్ష రూపాయల విలువైన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, విచారణ కొనసాగుతుందని తెలిపారు.
Also Read :
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..