ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..

 ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో అనారోగ్యానికి గురైన ఆవుకు శస్త్ర చికిత్స చేశారు పుశు వైద్యులు. ఆవు పొట్టలో నుంచి సుమారు 80 కిలోల వ్యర్థాలు బయటకు తీశారు.

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..
Follow us

|

Updated on: Oct 31, 2020 | 4:57 PM

ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో అనారోగ్యానికి గురైన ఆవుకు శస్త్ర చికిత్స చేశారు పుశు వైద్యులు. ఆవు పొట్టలో నుంచి సుమారు 80 కిలోల వ్యర్థాలు బయటకు తీశారు. హైదరాబాద్ అమీన్‌పూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వ చైతన్య ఈ ఆపరేషన్ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో రోడ్లపై తిరిగే రెండు ఆవులు ఆహారం తీసుకోకుండా అనారోగ్యంతో కనిపించడంతో… ఇరవై రోజుల క్రితం బీరంగూడలోని గోశాలకు తీసుకువచ్చారు.  పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు వల్ల అవి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.  అయితే ఈ రెండు ఆవుల్లో ఒకటి మూడు రోజుల క్రితం చనిపోయింది.

అయితే మరో ఆవు కూడా అనారోగ్యంతో ఉండటంతో మండల పశువైద్యాధికారి విశ్వ చైతన్య దానికి ఆపరేషన్ చేశారు. ఆ ఆవు పొట్టలో నుంచి సుమారు 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు.  అనంతరం ఆవు ఆరోగ్యంగా తిరుగుతుందని, ఆహారం తీసకుంటుందని ఆయన తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఆహారానికి సంబంధించిన వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వీధుల్లో పార వేయొద్దని ఆయన కోరారు. అలాంటి వాటిని తిని అనేక మూగజీవులు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.