గ్రీన్‌ చికెన్‌ కర్రీ ఎలా చేయాలంటే.?

TV9 Telugu

26 April 2024

చికెన్‌, కొత్తమీర గుప్పెడ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయ, జీడిపప్పు, మిరియాల పొడి, పసుపు, పెరుగు, గరం మసాలా, నూనె గ్రీన్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు.

ముందుగా మీరు షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్‌ను మంచి నీటితో శుభ్రంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి.

కొత్తిమీర, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి , పుదీనా, ఫ్రై చేసిన ఉల్లి ముక్కలు, జీడిపప్పును వేసి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి.

తర్వాత ఒక బౌల్‌లో కడిగిన చికెన్‌కు ఉప్పు, నల్ల మిరియాల పొడి, పసుపు,పెరుగు, గ్రైండ్ చేసిన గ్రీన్‌ పేస్టును వేసి బాగా కలుపుకోవాలి.

ఒక ప్యాన్‌లో నూనె తీసుకొని స్టౌవ్‌పై వేడి అయిన తర్వాత రెడీగా ఉంచుకున్న చికెన్‌ మొత్తం వేసి బాగా కలపాలి.

తర్వాత మూత ప్యాన్‌పై పెట్టి మీడియం ఫ్లెమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిసాలు పాటు స్టౌవ్‌పై ఉడికించాలి.

15 నిమిషాల తర్వాత అందులో గరం మసాలా వేసుకోని ముక్క ఉడికిందో లేదో చూసుకొని అవసరం మేరకు ఉప్పును కలుపుకోవాలి.

మళ్లీ కాసేపు సిమ్‌లో ఉడికించుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీ గ్రీన్‌ చికెన్‌ కర్రీ రడీ అయినట్లే. ఈ కర్రీ రైస్‌, చపాతీ, పరోటాతో రుచిగా ఉంటుంది.