రాత్రుళ్లు అరటిపండు తినవచ్చా.?

TV9 Telugu

26 April 2024

రాత్రిపూట అరటిపండు తీసుకోవడం వాళ్ళ జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మీరు ఇప్పటికే జలుబు లేదా దగ్గు సమస్యలతో బాధపడుతున్నట్లయితే రాత్రి సమయంలో అరటిపండు తినకపోవడం చాల మంచిది.

రాత్రి సమయంలో శరీరంలో మెటబాలిజం స్థాయి చాల తక్కువగా ఉంటుంది అంటున్నారు పోషకాహార, వైద్యారోగ్య నిపుణులు.

అటువంటి పరిస్థితిలో, అరటిపండు తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది ఉదయం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. సాధారణంగా అరటిపండ్లు జీర్ణం కావడానికి సమయం ఎక్కువగా పడుతుంది.

కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు అరటిపండుకు దూరంగా ఉండడమే మేలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.

ఇక అరటిపండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రాత్రుళ్లు దీన్ని దూరం పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల నిద్ర సమస్యలు, బద్ధకం ముంచుకొస్తాయి. మీరు ఏ పనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు.