మోదీకి జగన్ లేఖ.. నిధులివ్వకపోతే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏకంగా ఏడు పేజీలున్న ఈ లేఖలో పలు కీలకాంశాలను ప్రస్తావించారు. అక్టోబర్ 28న రాసిన ఈ లేఖ తాలూకు వివరాలు...
Jagan letter to Narendra Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏకంగా ఏడు పేజీలున్న ఈ లేఖలో పలు కీలకాంశాలను ప్రస్తావించారు. అక్టోబర్ 28న రాసిన ఈ లేఖ తాలూకు వివరాలు శనివారం మీడియాకు వెల్లడయ్యాయి. ఏడు పేజీల లేఖలో ఓ కీలకాంశంలో జోక్యం చేసుకోవాలని జగన్ ప్రధాన మంత్రి మోదీని అభ్యర్థించారు.
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై ఏడు పేజీల లేఖ రాశారు సీఎం జగన్. పోలవరం నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. ‘‘ విభజన చట్టంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు.. 2014 విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా భరించాలి.. సీడబ్ల్యూసీ, టీఎసి 55 వేల 548 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపాయి.. ఇరిగేషన్, భూ సేకరణ, పునరావాసాలకు కేంద్రమే నిధులు ఇవ్వాలి.. ’’ అని తాను రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కింద 28 వేల 191 కోట్ల రూపాయలు అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. సవరించిన అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన లేఖలో కుండబద్దలు కొట్టారు. పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, శరవేగంగా నిర్మాణం జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. పనులు జరుగుతున్నంత వేగంగా కేంద్రం నిధులివ్వకపోవడం ఇబ్బందిగా పరిణమిస్తోందని సీఎం మోదీకి నివేదించారు. తక్షణం నిధుల విడుదల జరిగేలా సంబంధిత యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని ఆయన ప్రధాన మంత్రిని కోరారు.
ALSO READ: కమలనాథులకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్
ALSO READ: 60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ… నితీశ్‌పై మోదీ ధ్వజం!
ALSO READ: సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు
ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు