సాయి తేజ్ మూవీ : నివేదా ప్లేసులో ఐశ్వర్యా రాజేష్​!

మెగా మేనల్లుడు సాయి​ తేజ్ ప్రస్తుతం దేవా  కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కథనాయికగా తొలుత నివేదా పేతురాజ్​ని ఫైనల్ చేశారు.

సాయి తేజ్ మూవీ : నివేదా ప్లేసులో ఐశ్వర్యా రాజేష్​!
Ram Naramaneni

|

Oct 31, 2020 | 5:47 PM

మెగా మేనల్లుడు సాయి​ తేజ్ ప్రస్తుతం దేవా  కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కథనాయికగా తొలుత నివేదా పేతురాజ్​ని ఫైనల్ చేశారు. అయితే ఇప్పుడు  ఆమె స్థానంలోకి  ఐశ్వర్యా రాజేష్​ వచ్చినట్లు తెలుస్తోంది.  నివేదా పేతురాజ్​ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల..కాల్షీట్లు అడ్జెస్ట్  చేయలేక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో షూటింగ్‌ జరుపుకొంటోందీ చిత్రం.

 ఈ చిత్రానికి ‘రిపబ్లిక్​’ అనే పేరును ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 2004లో ఏలూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, రాజకీయ నేపథ్యంలో ఆసక్తికర కథనంతో దేవ కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట . ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో‌ సాయి​ తేజ్ డాక్టర్‌గా కనిపిస్తారట.

Also Read :

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నెపోటిజం’ లొల్లి..సల్మాన్ సీరియస్

ఆదివారం రోహిత్​ గాయంపై బీసీసీఐ పరిశీలన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu