Hyderabad: పోలీస్ కుటుంబాల‌నూ వ‌ద‌ల‌ని సైబ‌ర్ కంత్రీగాళ్లు.. తాజాగా సీఐ భార్య‌ను ఎలా మాయ చేశారంటే

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jun 18, 2021 | 9:36 AM

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. వారు, వీరు అని లేదు అన్ని వ‌ర్గాల‌పై పంజా విసురుతున్నారు. వీరి ఆగడాలకు ‌అడ్డుకట్ట లేకుండా పోతోంది. పోలీసు కుటుంబాల‌ను...

Hyderabad: పోలీస్ కుటుంబాల‌నూ వ‌ద‌ల‌ని సైబ‌ర్ కంత్రీగాళ్లు.. తాజాగా సీఐ భార్య‌ను ఎలా మాయ చేశారంటే
Cyber Crime

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. వారు, వీరు అని లేదు అన్ని వ‌ర్గాల‌పై పంజా విసురుతున్నారు. వీరి ఆగడాలకు ‌అడ్డుకట్ట లేకుండా పోతోంది. పోలీసు కుటుంబాల‌ను సైతం విడువ‌డం లేదు. తాజాగా హైదరాబాద్ నారాయణగూడ సీఐ భార్య‌కు….. భారీగా టోకరా వేశారు. ఆన్‌లైన్‌లో 500 రూపాయలు విలువ చేసే చీరను… సీఐ భార్య‌ ఆర్డర్‌ చేశారు. తీరా వచ్చిన పార్శిల్‌లో చీర లేకపోవటంతో….. గూగుల్‌లో వెతికి సంబంధింత కంపెనీ కస్టమర్ కేర్ నంబరు తెలుసుకొని ఫోన్ చేశారు. ప్యాకింగ్‌లో మిస్టేక్ జరిగిందన్న అవతలి వ్యక్తి… డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి…బ్యాంక్ అకౌంట్ నంబరు తెలుసుకొని క్యూఆర్​ కోడ్ పంపించాడు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే…. 45 వేలు క‌ట్ అయ్యాయి. ఇదేంటని అడిగితే పొరపాటు జరిగిందంటూ… మరో కోడ్ పంపించాడు. ఇలా మూడు సార్లు ఆమె అకౌంట్ నుంచి 59 వేలు కొట్టేశాడు.

అర్థ‌మైందిగా.. మీ ఫోన్‌కి ఏదైనా లింక్‌ వచ్చినా…? డబ్బులు పంపించాలంటూ ఎవరైనా QR కోడ్‌ పంపించినా…? లేదా ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కోసం గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్ సెర్చ్ చేస్తున్నా…? అత్యంత‌ అప్రమత్తంగా ఉండండి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా… మీ ఖాతాలో సొమ్ము స్వాహా చెయ్య‌డానికి కంత్రీగాళ్లు కాచుకు కూర్చున్నారు.  సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు.. ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

Also Read: సైబర్‌ నేరగాళ్ల ఆన్‌లైన్‌ మోసాలకు హెల్ప్‌లైన్‌ చెక్‌.. వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి

 వివాహం వాయిదా.. గ‌దిలోకి వెళ్లిన యువ‌తి ఎంత పిలిచినా ప‌ల‌క‌లేదు.. తీరా

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu