AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: వివాహం వాయిదా.. గ‌దిలోకి వెళ్లిన యువ‌తి ఎంత పిలిచినా ప‌ల‌క‌లేదు.. తీరా

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కొంద‌రు లైఫ్ వాల్యూని అర్థం చేసుకోలేక‌పోతున్నారు. చిన్న‌, చిన్న కార‌ణాల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. పెంచి పెద్ద....

Nellore: వివాహం వాయిదా.. గ‌దిలోకి వెళ్లిన యువ‌తి ఎంత పిలిచినా ప‌ల‌క‌లేదు.. తీరా
Woman Suicide
Ram Naramaneni
|

Updated on: Jun 18, 2021 | 9:25 AM

Share

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కొంద‌రు లైఫ్ వాల్యూని అర్థం చేసుకోలేక‌పోతున్నారు. చిన్న‌, చిన్న కార‌ణాల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. పెంచి పెద్ద చేసిన త‌ల్లిదండ్రుల గురించి, భవిష్య‌త్ గురించి క‌న్న క‌ల‌ల‌ను మ‌ర్చిపోయి.. క్ష‌ణికావేశంలో త‌నువు చాలిస్తున్నారు. తాజాగా పెళ్లి వాయిదా పడిందన్న మనస్తాపంతో ఓ యువతి (19) ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు నగరంలోని శెట్టిగుంట రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. స్థానిక పిండిమిల్లు సెంటరు వద్ద ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఆరు నెలల క్రితం పెళ్లి చేశారు పెద్ద‌లు. రెండో కుమార్తెకూ వివాహం చేయాలని నిర్ణయించినా.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఏడాది వాయిదా వేశారు. దాంతో మనస్తాపానికి గురైన ఆ యువతి బెడ్ రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకుంది. గదిలోనుంచి కుమార్తె ఎంతకూ బయటకు రాకపోవడం, పిలిచినా ప‌ల‌క‌క‌పోవ‌డంతో తల్లిదండ్రులు పరిశీలించగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్ట‌ర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం’.. ర‌క్ష‌ణ కావాలంటూ పిటిష‌న్ వేసిన మహిళ‌కు కోర్టు ఫైన్

 ఒకేసారి ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడాడు..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!