AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanugula Venkata Rao : రచయిత కణుగుల వెంకటరావు గుండెపోటుతో కన్నుమూత.. సాహితీ లోకానికి తీరని లోటు..

Author Kanugula Venkata Rao : కథానిలయం ట్రస్టు బోర్డు సభ్యుడు, రచయిత కణుగుల వెంకటరావు గురువారం ఉదయం గుండె

Kanugula Venkata Rao : రచయిత కణుగుల వెంకటరావు గుండెపోటుతో కన్నుమూత.. సాహితీ లోకానికి తీరని లోటు..
Kanugula Venkata Rao
uppula Raju
|

Updated on: Jun 18, 2021 | 8:45 AM

Share

Author Kanugula Venkata Rao : కథానిలయం ట్రస్టు బోర్డు సభ్యుడు, రచయిత కణుగుల వెంకటరావు గురువారం ఉదయం గుండె పోటుతో మ‌ృతిచెందారు. ఈయన అకాల మరణం సాహితో ప్రపంచానికి తీరని లోటు. తంతితపాలా శాఖలో సీనియర్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఈయన ఆ తర్వాత సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్వగ్రామం బూర్జ మండలం తోటవాడ. అక్కడ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేశారు. వెంకటరావు ‘కవేరా కలం-కాలం’ పేరుతో సమగ్ర సాహిత్య గ్రంథం రాశారు. పద్దెనిమిదో ఏటనే రాసిన కథ ‘వినోదిని’ పత్రికలో ప్రచురితమైంది. ‘నన్ను చెప్పనివ్వండి, పెద్ద మాస్టారు, షాక్‌, మధుబాల’ వంటి కథలు, తెలుగు భాషా సాహిత్యం ఆవిర్భావం, తెలుగు పంచకావ్యాలు వంటి అనువాద వ్యాసాలు, పర్లాఖెముండి అండ్‌ గిడుగు రామమూర్తి వ్యాసాలు రాశారు.

కారా మాస్టారు, కథానిలయం అంటే మక్కువ. అక్కడ జరిగే ప్రతి సాహితీ సభకు హాజరయ్యేవారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వైద్యుడు కె.సుధీర్‌ ఆయన ప్రథమ కుమారుడు. రచయిత కణుగుల వెంకటరావు సాహిత్య ప్రపంచానికి ఎనలేని క‌ృషి చేశారు. కొత్త రచయితలను ప్రోత్సహించారు. చాలా పుస్తకాలను తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్ననాటి నుంచే తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న వెంకటరావు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తూనే రచనలు చేసేవారు. ఉద్యోగ విరమణ అనంతరం పూర్తిగా సాహిత్యంపై దృష్టి కేంద్రీకరించారు. తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు. కథానిలయం ట్రస్టు బోర్డు సభ్యుడిగా సేవలందించారు.

IND vs NZ WTC Prediction: సమఉజ్జీల పోరులో గెలిచేదెవరో..? తొలి కప్‌ను సాధించేందుకు కోహ్లీ, విలియమ్సన్‌ తహతహ!

Two Double Centuries : ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్..! ఇతడికి భారతజట్టుతో సంబంధం ఏంటి..?

‘తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం’.. ర‌క్ష‌ణ కావాలంటూ పిటిష‌న్ వేసిన మహిళ‌కు కోర్టు ఫైన్