Two Double Centuries : ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్..! ఇతడికి భారతజట్టుతో సంబంధం ఏంటి..?

Two Double Centuries : ఒక మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధిస్తే అది బ్యాట్స్‌మన్‌కు చాలా పెద్ద విజయంగా మారుతుంది.

Two Double Centuries : ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన క్రికెటర్..! ఇతడికి భారతజట్టుతో సంబంధం ఏంటి..?
Arthur Fogg
Follow us

|

Updated on: Jun 18, 2021 | 7:54 AM

Two Double Centuries : ఒక మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధిస్తే అది బ్యాట్స్‌మన్‌కు చాలా పెద్ద విజయంగా మారుతుంది. అయితే ఒక మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో ఒక బ్యాట్స్ మాన్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడని మీకు తెలుసా.. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఈ రోజు ఆ బ్యాట్స్‌మెన్ పుట్టినరోజు కూడా. అయితే ఈ ఓపెనర్ బ్యాట్స్‌మన్‌కు మన భారత జట్టుతో సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఆ ఆటగాడి పేరు ఆర్థర్ ఫాగ్. అతను 18 జూన్ 1915 న జన్మించాడు. అతని కెరీర్‌లో అతిపెద్ద ఘనత ఏమిటంటే ఒక మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం. వాస్తవానికి ఇంగ్లాండ్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆర్థర్ ఫాగ్, కెంట్ తరఫున ఆడుతున్నప్పుడు ఎసెక్స్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ 1938 సంవత్సరంలో జరిగింది. అతను మొదటి రోజున ఐదు గంటల బ్యాటింగ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు గంటల 50 నిమిషాల్లో అజేయంగా 202 పరుగులు చేశాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు18 నెలల ముందు అతన్ని ఆస్ట్రేలియా పర్యటన నుంచి స్ట్రెచర్‌పై మైదానంలోకి తీసుకువచ్చారు. అతనికి రుమాటిక్ జ్వరం వచ్చింది ఈ కారణంగా అతను 1937 సీజన్ మొత్తాన్ని మైదానం బయట గడపవలసి వచ్చింది. గొంతు ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే ఈ జ్వరంలో గుండె, చర్మం, కీళ్ళు, మెదడు ప్రభావితమవుతాయి. శ్రీలంక బ్యాట్స్‌మన్ ఏంజెలో పెరెరా ఒక మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ డబుల్ సెంచరీలు చేసిన ఫాగ్ రికార్డును సమం చేశాడు. 2019 ఫిబ్రవరిలో సింహళీ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో పెరెరా 201 మరియు 231 పరుగులు చేశాడు.

భారత జట్టుతో టెస్ట్ అరంగేట్రం ఆర్థర్ ఫాగ్ 23 సంవత్సరాల వయస్సులో ఒక మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో డబుల్ సెంచరీ సాధించి ఉండవచ్చు. కానీ దీనికి రెండు సంవత్సరాల ముందు అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతను జూలై 25, 1936 న భారత క్రికెట్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడాడు. ఫాగ్ ఇంగ్లాండ్ తరఫున మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 18.75 సగటుతో 150 పరుగులు చేశాడు. అదే సమయంలో 435 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 36.05 సగటుతో 27291 పరుగులు అతని పేరుతో నమోదు చేయబడ్డాయి. ఇందులో 58 సెంచరీలు, 128 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 269 నాటౌట్.

IND vs NZ WTC Final 2021 : నేడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్.. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం..

Tipu Sultan: వివాదస్పదంగా మారుతున్న టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న కమలం నేతలు

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం భారీగా తగ్గింది