Hyderabad: అప్పుడు మోసం చేశాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..?

Jail For Rape Case: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ అత్యాచారం కేసులో న్యాయస్థానం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో పాతబస్తీలోని ఛత్రినాక

Hyderabad: అప్పుడు మోసం చేశాడు.. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 12, 2021 | 7:30 AM

10 Years Jail For Rape Case: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ అత్యాచారం కేసులో న్యాయస్థానం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యాచార కేసుకు సంబంధించిన తీర్పును న్యాయస్థానం సోమవారం వెలువరించింది. ఛత్రినాక ఇన్ స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని తెలిపిన వివరాల ప్రకారం .. పాతబస్తీ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళను అయోధ్యనగర్‌కు చెందిన బెల్లం కొండ సుమన్(31) ప్రేమిస్తున్నానని కొన్నిరోజులపాటు వెంట పడ్డాడు. 2016లో పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినవుడల్లా దాటవేయడం.. నిరాకరిస్తుండడంతో మోసపోయానని గుర్తించిన మహిళ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ డి.నాగార్జున్ నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.

నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్.

Also Read:

Etela Rajender: హీటెక్కుతున్న ఉప పోరు.. ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..?

US Plane Crash: ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం.. మరో ఇద్దరికి..

Crime News: స్నానం చేస్తున్న వివాహిత వీడియో చిత్రీకరణ.. బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతూ అన్నదమ్ముళ్ల లైంగిక దాడి!