ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మ‌హ‌త్య

ఏం క‌ష్టం వ‌చ్చిందో లేదో తెలియ‌దు కానీ ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో.. స్థానికంగా క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. కుటుంబ స‌భ్యులంద‌రూ ఒకే సారి సూసైడ్ చేసుకోవ‌డం మిస్ట‌రీగా మారింది. ఈ విషాద‌ ఘ‌ట‌న రాజ‌స్థాన్ జోధ్‌పుర్‌లోని..

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మ‌హ‌త్య
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2020 | 2:04 PM

ఏం క‌ష్టం వ‌చ్చిందో లేదో తెలియ‌దు కానీ ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో.. స్థానికంగా క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. కుటుంబ స‌భ్యులంద‌రూ ఒకే సారి సూసైడ్ చేసుకోవ‌డం మిస్ట‌రీగా మారింది. ఈ విషాద‌ ఘ‌ట‌న రాజ‌స్థాన్ జోధ్‌పుర్‌లోని లోహ్‌దాత గ్రామంలో జ‌రిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన 12 మంది విషం తాగి సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌గా.. ఇందులో 11 మంది మృతి చెందారు. ఒక‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో ఆ వ్య‌క్తిని స‌మీపంలోని ఆస్ప‌త్రిలో చేర్పించారు.

పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుబం కొన్నేళ్ల క్రితం రాజ‌స్థాన్‌కు వ‌చ్చింది. వీరంతా హిందూ శ‌ర‌ణార్థులు. కుటుంబ స‌భ్యులంతా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాస‌న వెద‌జ‌ల్లుతున్న‌ట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read More:

స్వ‌ర్ణ ప్యాలెస్ ఘ‌ట‌నః మృతుల వివ‌రాలు ఇవే

ఒకే సినిమాలో అక్కా చెల్లెళ్లుగా ర‌ష్మిక, స‌మంత‌?