అల్లుడు త‌ల న‌రికి.. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లిన మామ

తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం డి.జె.పురంలో దారుణం జ‌రిగింది. సొంత అల్లుడి తల తెగ‌ నరికి చంపాడు మామ పల్లా సత్యనారాయణ.

అల్లుడు త‌ల న‌రికి.. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లిన మామ
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 09, 2020 | 3:39 PM

Father in law kills son in law: తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం డి.జె.పురంలో దారుణం జ‌రిగింది. సొంత అల్లుడి తల తెగ‌ నరికి చంపాడు మామ పల్లా సత్యనారాయణ. అనంతరం అత‌డి‌ తలను సంచిలో వేసుకుని అన్నవరం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. సత్యనారాయణ కుమార్తె గతేడాది అనుమానాస్పద స్థితిలో చ‌నిపోయింది. అప్పటినుంచి ఆమె ఇద్ద‌రి కూతుర్లు తాత సత్యనారాయణతోనే ఉంటున్నారు. గ‌త‌ రాత్రి అత్తారింటికి వ‌చ్చిన‌ అల్లుడు భార్యను తానే చంపినట్లు మద్యం మత్తులో మామతో చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశానికి లోనైన స‌త్య‌నారాయ‌ణ‌ ఉదయం అల్లుడు తల నరికి మనవరాళ్లతో సహా అన్నవరం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు.

Read More : నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ