AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు

Skoda Slavia.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా నుంచి రాబోతున్న స్లావియా ఫేస్‌లిఫ్ట్ కోసం ఆటోమొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సరికొత్త వెర్షన్‌ను ఆగస్టు 18న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు స్కోడా విడుదల చేసిన టీజర్‌లు టెక్ ప్రపంచంలో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి.

పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు
Skoda Slavia Facelift
Nikhil
|

Updated on: Aug 19, 2026 | 6:40 AM

Share

స్కోడా సంస్థ తన పాపులర్ సెడాన్ ‘స్లావియా ఫేస్‌లిఫ్ట్’ను ఆగస్టు 18న విడుదల చేయనుంది. కొత్త హెడ్‌లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా ఒక కొత్త మోడల్ కాకుండా మిడ్-లైఫ్ అప్‌డేట్ అయినప్పటికీ, కారు బాహ్య డిజైన్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులతో పాటు అనేక కొత్త ఫీచర్లు, గేర్‌బాక్స్‌లో భారీ అప్‌గ్రేడ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెడాన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లేటెస్ట్ కార్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

డిజైన్‌లో కీలక మార్పులు

ఇప్పటికే రహదారులపై కనిపించిన టెస్ట్ కార్లను బట్టి చూస్తే, కొత్త స్లావియాలో ముందు భాగంలో మార్పులు ఎక్కువగా ఉండొచ్చని స్పష్టమవుతోంది. కొత్త హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లు మరియు పూర్తిగా రీడిజైన్ చేసిన బంపర్లు ఇందులో కనిపించనున్నాయి. ముందు గ్రిల్ డిజైన్ కూడా మారిపోనుండగా, కొత్త గ్రిల్‌లో కుషాక్‌లో కనిపించే తరహాలోనే ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండొచ్చని సమాచారం.

అంతేకాకుండా అల్లాయ్ వీల్స్‌కు కూడా సరికొత్త డిజైన్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. వెనుక భాగంలో కొత్త టెయిల్‌లైట్లు లాంటి ఆకర్షణీయమైన చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక క్యాబిన్ విషయానికి వస్తే ప్రస్తుత స్లావియా డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను స్కోడా పెద్దగా మార్చకపోవచ్చని తెలుస్తోంది. అయితే కొన్ని ఆధునిక కొత్త ఫీచర్లను ఇందులో జోడించనున్నారు. అందులో ముఖ్యంగా 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే రావచ్చని సమాచారం.

కొత్త సీట్ అప్‌హోల్స్టరీ కూడా అందుబాటులోకి రానుంది. ఇటీవల కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన వెనుక సీట్ల మసాజ్ ఫంక్షన్‌ను ఈ స్లావియాకు కూడా ఇస్తారా అనేది ప్రస్తుతం టెక్ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెనుక ఏసీ వెంట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ లాంటి భద్రతా ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు.

అంచనా ధరల వివరాలు

ఈ స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో మెకానికల్‌గా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.0 లీటర్ TSI మరియు 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కంపెనీ కొనసాగించే అవకాశం ఉంది. 1.0 TSI ఇంజిన్ 115hp పవర్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కొనసాగవచ్చు.

అయితే ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రం అత్యంత కీలకమైన మార్పు రాబోతోంది. ప్రస్తుత 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది. ఈ అధునాతన గేర్‌బాక్స్ ఇప్పటికే ఫేస్‌లిఫ్ట్ కుషాక్‌లో విజయవంతంగా పరిచయమైంది. మరోవైపు 150hp శక్తిని అందించే 1.5 TSI ఇంజిన్ మాత్రం 7-స్పీడ్ DCT ఆటోమేటిక్‌తోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.18.19 లక్షల మధ్యలో ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రానున్న కొత్త ఫీచర్లు మరియు అప్‌డేట్ల కారణంగా ధరలో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కొత్త స్లావియా కూడా ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ విభాగంలోనే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, వోక్స్వాగన్ వర్టస్ లాంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Follow Us