వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి బంపరాఫర్.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఒక పక్క సైబర్ నేరగాళ్లు రకరకాల మాయలు చేసి ఆన్ లైన్లో సొమ్ములు స్వాహా చేస్తుంటే, ఆఫ్ లైన్లో సరికొత్త చీటింగ్ కు పాల్పడింది ఒక బ్యాచ్. సందట్లో సడేమియాలా
Covid Cheating: ఒక పక్క సైబర్ నేరగాళ్లు రకరకాల మాయలు చేసి ఆన్ లైన్లో సొమ్ములు స్వాహా చేస్తుంటే, ఆఫ్ లైన్లో సరికొత్త చీటింగ్ కు పాల్పడింది ఒక బ్యాచ్. సందట్లో సడేమియాలా కొవిడ్ టీకాను ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ సరికొత్త వింతైన మొసం కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఉయ్యూరు సర్కిల్ పరిధిలో తోట్లవల్లూరు, పమిడిముక్కల గ్రామలాల్లో కొవిడ్ టీకా రెండు డోస్ లు వేయించుకున్నవారి నుండి నెలకు 900 రూపాయలు వస్తాయి అని నమ్మించారు ఇద్దరు కేటుగాళ్లు.
ఇలా అమాయకుల్ని నమ్మించిన ఇద్దరు కిలాడీలు ఆశావహుల దగ్గర్నుంచి ఆధార్ కార్డు నెంబర్, వేలిముద్ర తీసుకుని, ఫేక్ అకౌంట్‌లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముద్దాయిలు తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలోని దేవరపల్లి అశోక్ S/O చంద్రశేఖర్ వయసు 29 సం, 2. కంకిపాడు మండలం కొలవెన్ను గ్రామం కొడాలి విజయ సాగర్ S/O భాస్కరరావు. అని పోలీసులు నిర్ధారించారు.
వీరిద్దరూ ఇలా మొత్తం 9 నేరాలు ఈ మధ్య కాలంలో చేశారని పోలీసులు వెల్లడించారు. దేవరపల్లి లో ఇద్దర్నీ, కలవపాములులో ఇద్దర్నీ, పమిడిముక్కలులో నలుగుర్ని, నూజివీడులో ఒకర్ని మోసం చేసి సుమారు 73,000 నగదు అపహరించినట్టు పోలీసులు తేల్చారు. పమిడిముక్కలలో వీరివద్ద నుండి 42000/-రూ రికవరీ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు పమిడిముక్కల పోలీసులు.
Read also: Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో దారుణం.. ఐదేళ్ళ బాలుడిపై కందిరీగల దాడి