Disha SOS: ఆపదలో ఉన్న యువతిని ఆదుకున్న దిశ యాప్.. మేమున్నామని సహాయం చేసిన పిడుగురాళ్ల పోలీసులు..

మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన 'దిశ' యాప్ వేగంగా పని చేస్తోంది. పోలీసులు సత్వరమే స్పందించి బాధితులకు సహాయం చేస్తున్నారు. దిశా యాప్ SOSకు కాల్‌ చేయడంతో సత్వరమే స్పందించారు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల  పోలీసులు

Disha SOS: ఆపదలో ఉన్న యువతిని ఆదుకున్న దిశ యాప్.. మేమున్నామని సహాయం చేసిన పిడుగురాళ్ల పోలీసులు..
Disha Sos
Follow us

|

Updated on: Aug 29, 2021 | 8:25 AM

మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ’ యాప్ వేగంగా పని చేస్తోంది. పోలీసులు సత్వరమే స్పందించి బాధితులకు సహాయం చేస్తున్నారు. దిశా యాప్ SOSకు కాల్‌ చేయడంతో సత్వరమే స్పందించారు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల  పోలీసులు. అసలు ఏం జరిగిందంటే.. బంధువులతో కలిసి గుత్తికొండ బిలం సందర్శనకు ఓ యువతి వెళ్లింది. అయితే దర్శనం అనంతరం ఆటోలో బంధువులు బయలు దేరారు. యువతి మాత్రం స్కూటీపై బయలు దేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా వర్షం మొదలైంది. వర్షం కారణంగా తడుస్తానేమో అని భావించి కొంచెం సేపు చెట్టు కింద నిరీక్షించింది. జోరు వర్షంతో రహదారి మొత్తం బురదగా మారడంతో ముందుకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. అటుగా ఎవరూ రాక పోవడంతో కొంత ఆందోళనకు గురైంది. ఈ లోగా చీకటి కమ్మేయడంతో నిస్సహాయ స్థితికి చేరింది ఆ యువతి.

ఇక తాను ఇక్కడే చిక్కుకు పోయానే అయి రోధిస్తున్న తరుణములో.. దిశా SOS బటన్ నొక్కి పోలీస్ వారి సహాయాన్ని కోరింది. దిశా SOS కు వచ్చిన కాల్ పై వెంటనే స్పందించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్సై చరణ్ కి సమాచారాన్ని అందించారు. వెంటనే బాధితురాలిని రక్షించమని ఆదేశించాడు.

ఎస్సై చరణ్ గుత్తికొండ మహిళా పోలీస్ వారి సహయముతో యువతిని రక్షించి క్షేమంగా వారి బంధువులకు అప్పగించడం జరిగినది. ఆపదలో ఉన్న తనను దిశా యాప్ ద్వారా రక్షించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్‌కి ఎస్సై చరణ్‌కి మహిళ పోలీసులకు యువతి కృతజ్ఞతలు తెలిపింది. ప్రతి ఒక్కరు దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్న వారికి దిశా యాప్ అండగా ఉంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి: ED: బెంగాల్ మళ్లీ రాజకీయ రగడ.. దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. వెలుగులోకి బొగ్గు స్కాం..