కేవలం 100 రూపాయ‌ల కోసం వ్య‌క్తిని కిరాత‌కంగా చంపిన దంప‌తులు.. అసలు ఏం జ‌రిగిందంటే..?

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. కేవ‌లం 100 రూపాయ‌ల కోసం ఓ వ్య‌క్తిని అత్యంత కిరాత‌కంగా చంపారు భార్య‌భ‌ర్త‌లు. దంప‌తులు దాడిలో...

కేవలం 100 రూపాయ‌ల కోసం వ్య‌క్తిని కిరాత‌కంగా చంపిన దంప‌తులు.. అసలు ఏం జ‌రిగిందంటే..?
Delhi Crime
Follow us
Ram Naramaneni

|

Updated on: May 17, 2021 | 7:45 AM

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. కేవ‌లం 100 రూపాయ‌ల కోసం ఓ వ్య‌క్తిని అత్యంత కిరాత‌కంగా చంపారు భార్య‌భ‌ర్త‌లు. దంప‌తులు దాడిలో 40 ఏళ్ల వ్య‌క్తి క‌న్నూమూశాడు. ఈ ఘర్షణలో అతడిపై కత్తితో దాడిచేసి పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు.

అసలు ఏం జ‌రిగిందంటే…

ఢిల్లీలోని మంగోల్​పురిలో నివ‌శించే నిందితుడు జితేందర్​.. అజిత్​(40) అనే వ్యక్తిని రూ.100 ఇవ్వాలని కోరాడు. ఈ అంశంపై ఇరువురి మధ్య గొడ‌వ మొదలైంది. డబ్బులు ఇవ్వడం కుద‌ర‌ద‌న్న‌ అజిత్​.. వాదిస్తున్నాడ‌న్న‌ ఆగ్రహంతో జితేందర్​ను కొట్టాడు. ఆ తర్వాత.. జితేందర్​ ఇంటికి వెళ్లి కత్తితో తిరిగొచ్చాడు. అతడితోపాటు భార్య కూడా వచ్చింది. వారిద్దరూ అజిత్​పై దాడి చేసి.. కత్తితో పొడిచి ఎస్కేప్ అయ్యారు. విషయం తెలిసిన పోలీసులు.. సంజయ్​ గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జితేందర్​ భార్య రేష్మను అరెస్ట్​ చేసినట్టు వివ‌రించారు. పరారీలో ఉన్న జితేందర్​ కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు.

Also Read: భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇదే.. ఎందుకో తెలుసా..

స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం