Shocking Video: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం

భూ ప్ర‌పంచంలో క‌రోనా సృష్టిస్తోన్న భయంకరమైన విధ్వంసం అంతా, ఇంతా కాదు. ఈ మ‌హమ్మారి మ‌నుషుల నుంచి జంతువులు, ప‌క్షులకు కూడా విస్త‌రించింది.

Shocking Video: స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం
Car Brusts Intlo Flames
Follow us

|

Updated on: May 16, 2021 | 3:47 PM

భూ ప్ర‌పంచంలో క‌రోనా సృష్టిస్తోన్న భయంకరమైన విధ్వంసం అంతా, ఇంతా కాదు. ఈ మ‌హమ్మారి మ‌నుషుల నుంచి జంతువులు, ప‌క్షులకు కూడా విస్త‌రించింది. ప్ర‌స్తుత స‌మ‌యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి మాస్కులు, శానిటైజ‌ర్లు ప్ర‌ధాన వెప‌న్స్ అని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల, చాలా మంది ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు వెళ్లిన‌ప్పుడు వీటిని త‌మ‌తో తీసుకెళ్తున్నారు. కానీ ఇటీవల ఒక ప్రమాదం జరిగింది, దాని గురించి విన్న తర్వాత మీరు శానిటైజర్ ఉపయోగించే ముందు ఒక‌టికి వందసార్లు ఆలోచిస్తారు. శానిటైజర్ కారణంగా, ఎవరూ ఊహించ‌లేని విధంగా కారు ప్రమాదం జరిగింది.

వివ‌రాల ప్రకారం, గురువారం కారులో హ్యాండ్ శానిటైజర్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన అమెరికా మేరీల్యాండ్‌లో చోటుచేసుకుంది. మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్… కారులో హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మంటలు సంభవించాయని తెలిపింది. కారులోని వ్య‌క్తి స్మోకింగ్ చేయ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలిపింది.

వీడియో ఇక్కడ చూడండి

ఈ సంఘటనకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, కారు రహదారి మ‌ధ్య‌లో కాలిపోతున్నట్లు కనిపిస్తుంది. కారు నడుపుతున్న వ్యక్తిని వెంటనే కాలిపోతున్న కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి శానిటైజర్‌లో ఇథనాల్ లేదా ఐసోప్రొపనాల్ ఉంటుంది. ఇది మండే స్వభావం క‌ల‌ది. కాబట్టి వేగంగా మంట‌లు వ్యాపించాయి.

ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదని గ్ర‌హించండి. గతంలో, టెక్సాస్లో ఒక మహిళ చేతిలో శానిటైజర్ వేసుకుని అనంత‌రం కొవ్వొత్తిని వెలిగించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఆమె చేతికి మంట‌లు అంటుకున్నాయి. అందువల్ల, మీరు శానిటైజర్‌ను ఉపయోగించినప్పుడల్లా, ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఎందుకంటే మీ స్వల్ప పొరపాటు కూడా పెద్ద ప్రమాదంలో నెట్టివేయ‌వ‌చ్చు.

Also Read: వ్యాక్సిన్‌పై వ‌స్తోన్న అనుమానాల‌న్నీ ప‌టాపంచ‌లు.. కొత్త వేరియెంట్ల‌ను సైతం స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్న కోవాగ్జిన్‌..

ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్​ ఆడిన భార‌త ప్లేయ‌ర్.. ఇంట‌ర్నెట్ లో వీడియో వైర‌ల్