AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ కలకలం

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా కచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చరస్ (డ్రగ్స్‌లోని ఓ రకం) ప్యాకెట్లు విపరీతంగా దొరుకుతున్నాయి. ఓ విభాగం నుంచి పక్కా..

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ కలకలం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 04, 2020 | 6:10 PM

Share

గుజరాత్‌ తీర ప్రాంతంలో డ్రగ్స్‌ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా కచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చరస్ (డ్రగ్స్‌లోని ఓ రకం) ప్యాకెట్లు విపరీతంగా దొరుకుతున్నాయి. ఓ విభాగం నుంచి పక్కా సమాచారం అందడంతో.. తీర ప్రాతంలో పోలీసులు, కోస్ట్‌ గార్డులు పెట్రోలింగ్‌ చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు కచ్ తీర ప్రాంతంలో 24 చరస్ ప్యాకెట్లను కోస్ట్‌గార్డ్స్‌ గుర్తించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.36 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. కచ్ ప్రాంతంలోని జఖౌ పోర్ట్ సమీపంలోని కడియారి ద్వీప ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసిందని డిఫెన్స్‌ వింగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలావుంటే.. మే 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 88 చరస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కోస్టల్‌ ఏరియా అధికారులు వెల్లడించారు. వీటి విలువ రూ.1.32 కోట్లు ఉంటుందన్నారు. అయితే ఈ ప్యాకెట్లు పట్టుబడ్డ ప్రాంతంలో డ్రగ్ స్మగ్లర్లు సంచరిస్తున్నారని.. ఇది జనావాసాలు లేని ప్రాంతమని తెలిపారు. వీటిని సప్లే చేసే ముఠా కోసం గాలింపు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.