Khammam: పొలాల్లో కాలువ విషయంలో గొడవ.. కత్తులు, కర్రలతో ఇరువర్గాల ఘర్షణ.. ఐదుగురికి..
Telangana Crime: పంట పొలాల మధ్య నీటి కాలువ విషయంలో.. ఆ కుటుంబాల మధ్య ఏడాది నుంచి వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు
Telangana Crime: పంట పొలాల మధ్య నీటి కాలువ విషయంలో.. ఆ కుటుంబాల మధ్య ఏడాది నుంచి వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదరింది. పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గుంపేళ్లగూడెంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పాత కక్షలతో నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి పంట పొలాల మధ్య కాలువ విషయంలో రెండు కుటుంబాలు గొడవపడుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. దీంతో చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా.. ఈ ఇరువర్గాల దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై ఇరువర్గాలు సైతం పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి.
Also Read: