AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోదాడలో ఎల్ఐసీ ఏజెంట్ల స్కామ్

సూర్యపేట జిల్లా కోదాడలో ఘరానా మోసం బయటపడింది. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు ఎల్‌.ఐ.సీ సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కై.. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 3.14 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. కోదాడ ఎల్‌.ఐ.సీ కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్ బీకూ నాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో ఉద్యోగి రఘుచారి 8 మంది […]

కోదాడలో ఎల్ఐసీ ఏజెంట్ల స్కామ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2019 | 9:21 PM

Share

సూర్యపేట జిల్లా కోదాడలో ఘరానా మోసం బయటపడింది. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీమా డబ్బును జేబులో వేసుకున్నారు ఎల్‌.ఐ.సీ సిబ్బంది. ఏజెంట్లతోపాటు అధికారులు కుమ్మక్కై.. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 3.14 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బును అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు.

కోదాడ ఎల్‌.ఐ.సీ కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే బానోత్ బీకూ నాయక్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ గులోతు హర్యా ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో ఉద్యోగి రఘుచారి 8 మంది ఏజెంట్లతో కుమ్మక్కయ్యారు. నకిలీ మరణ దృవీకరణ పత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఎల్‌ఐసీకి చెందిన సోమ్మును డ్రా చేసుకున్నారు. పత్రాల్లో తెలిపిన నామినీల బ్యాంక్ ఖాతాల్లో కాకుండా సొంత ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకున్నారు.

2006 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు 190 నకిలీ పాలసీలు సృష్టించి 3.14 కోట్ల రూపాయలను తమ జేబులో వేసుకున్నారు. ప్రధాన నిందితుడు అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ బీకూ నాయక్ తండ్రి బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి పాలసీని డ్రా చేసుకున్నాడు. లావాదేవీలపై అనుమానం వచ్చిన కోదాడ ఎల్‌ఐసీ చీఫ్ మేనేజర్ విచారణ జరిపించారు.

అంతర్గత విచారణలో వీరి భాగోతాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో బీకూ నాయక్, గుగులోత్ హర్యా, ఏజెంట్లపై ఐపీసీ 120 బీ, 409, 420, 465, 467, 468, 471, 477ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు.

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..