నెల్లూరులో బాలుడి కిడ్నాప్.. 3గంటల్లో ఛేజ్

నెల్లూరులోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రిలో పసికందు కిడ్నాపైన కేసును మూడు గంటల్లో చేధించారు పోలీసులు. గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు మూడు గంటల్లో పట్టుకున్నారు. జిల్లాలోని కోట మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత బాలుడిని ఐసీయూలో ఉంచారు. అయితే ఈ ఉదయం 10.00 గంటల ప్రాంతంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. తాను బాలుడి […]

నెల్లూరులో బాలుడి కిడ్నాప్.. 3గంటల్లో ఛేజ్
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2019 | 9:26 PM

నెల్లూరులోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రిలో పసికందు కిడ్నాపైన కేసును మూడు గంటల్లో చేధించారు పోలీసులు. గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు మూడు గంటల్లో పట్టుకున్నారు. జిల్లాలోని కోట మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత బాలుడిని ఐసీయూలో ఉంచారు. అయితే ఈ ఉదయం 10.00 గంటల ప్రాంతంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. తాను బాలుడి తల్లిని అని చెప్పి పసికందును ఎత్తుకెళ్లింది.

సంతకం కూడా లక్ష్మి అనే చేయడంతో ఆమే తల్లి అని ఆస్పత్రి సిబ్బంది భావించారు. అయితే పసికందు కిడ్నాప్ అయిందని తెలిసి ఇటు కుటుంబ సభ్యులు, అటు ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందారు. ఆస్పత్రిలో పసికందు మాయమైందనే సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నెల్లూరు చుట్టూ 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళను పట్టుకున్నారు. ఆ తర్వాత కన్నతల్లికి బాలుడిని అప్పగించారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళను కోవూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.