దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత హతం

గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ టీఎంసీ నేత హతమయ్యాడు. మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండగులు… తృణ‌మూల్ కాంగ్రెస్ నేత నిర్మ‌ల్ కుందూపై తుపాకీతో కాల్చి చంపారు. ఓ టీ స్టాల్ ద‌గ్గ‌ర స్థానికుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు.. బైక్‌పై వెనుక కూర్చున్న వ్య‌క్తి టీఎంసీ నేత‌ను షూట్ చేశాడు. అనంతరం అదే బైక్‌పై ప‌రార‌య్యారు. అయితే తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. […]

దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత హతం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 05, 2019 | 6:47 PM

గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ టీఎంసీ నేత హతమయ్యాడు. మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండగులు… తృణ‌మూల్ కాంగ్రెస్ నేత నిర్మ‌ల్ కుందూపై తుపాకీతో కాల్చి చంపారు. ఓ టీ స్టాల్ ద‌గ్గ‌ర స్థానికుల‌తో మాట్లాడుతున్న‌ప్పుడు.. బైక్‌పై వెనుక కూర్చున్న వ్య‌క్తి టీఎంసీ నేత‌ను షూట్ చేశాడు. అనంతరం అదే బైక్‌పై ప‌రార‌య్యారు. అయితే తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. అయితే ఇది బీజేపీ నేతల పనేనంటూ.. టీఎంసీ ఆరోపిస్తోంది. గురువారం రోజున మృతిచెందిన కుందూ ఇంటికి సీఎం మమత వెళ్లాల్సి ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత నుంచి బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మ‌ధ్య హింసాత్మ‌క దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి.