Call Money: కృష్ణా జిల్లాలో కాల్ మనీ కలకలం.. వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య..!
కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికి కాల్ మనీ ఆత్మహత్యలు ఆగడం లేదు.
Call Money Harassment: మరోసారి ఏపీలో కాల్ మనీ కలకలం సృష్టించింది. తాజాగా కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికి కాల్ మనీ ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఈ కారణంగా ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్న గౌస్.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పు చేశాడు గౌస్. ప్రతి నెల వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. లక్షల్లో అప్పులు ఉన్నట్టు సృష్టించిన కాల్ మని మాఫియా వేధింపులకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తూ నరకం చూపించారు. ఈ క్రమంలోనే చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని గౌస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా , ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలు తీసుకునేలా వేధింపులకు గురిచేసిన వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గౌస్ మృతిపట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొండపల్లి పోలీసులు తెలిపారు.
Read Also… Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ