కాలిఫోర్నియా ఫుడ్ ఫెస్టివల్ లో కాల్పులు.. ముగ్గురి మృతి
కాలిఫోర్నియాలో… గిల్ రాయ్ ఫుడ్ ఫెస్టివల్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. సుమారు 12 మంది గాయపడ్డారు. మూడు రోజులపాటు జరిగిన ఈ ఫెస్టివల్ ఆదివారం సాయంత్రం ముగిసింది. కాలిఫోర్నియాకు కొంత దూరంలోని శాన్ జోస్ లో… వెల్లుల్లితో తయారు చేసిన ఆహార పదార్థాలతో ఓ ఫెస్టివల్ ను ఏటా నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ఫెస్టివల్ కు చాలామంది వస్తుంటారు. అయితే ఆదివారం సాయంత్రం సుమారు 30 ఏళ్ళ వ్యక్తి, తన అసాల్ట్ […]
కాలిఫోర్నియాలో… గిల్ రాయ్ ఫుడ్ ఫెస్టివల్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. సుమారు 12 మంది గాయపడ్డారు. మూడు రోజులపాటు జరిగిన ఈ ఫెస్టివల్ ఆదివారం సాయంత్రం ముగిసింది. కాలిఫోర్నియాకు కొంత దూరంలోని శాన్ జోస్ లో… వెల్లుల్లితో తయారు చేసిన ఆహార పదార్థాలతో ఓ ఫెస్టివల్ ను ఏటా నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ఫెస్టివల్ కు చాలామంది వస్తుంటారు. అయితే ఆదివారం సాయంత్రం సుమారు 30 ఏళ్ళ వ్యక్తి, తన అసాల్ట్ రైఫిల్ ని బట్టలో దాచుకుని వచ్చి హఠాత్తుగా దాన్ని బయటికి తీసి కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఆకస్మిక సంఘటనతో ప్రజలంతా భయంతో చెల్లాచెదరై పరుగులు తీశారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుడిని హతమార్చారు. జరిగిన ఘటనను మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి పోస్ట్ చేశాడు.
అటు-యుఎస్ అధ్యక్షుడు ట్రంప్.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని ట్వీట్ చేశారు. అయితే తమ దేశంలో నానాటికీ పెరిగిపోతున్న గన్ కల్చర్ ని ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై మాత్రం ట్రంప్ నోరెత్తడంలేదు. ఇప్పటికే కాలేజీ విద్యార్థులు సైతం యధేచ్చగా గన్స్ తెస్తూ తమ పగ తీర్చుకోవడానికి నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడుతున్నారు.