ఏలూరులో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆస్రం మెడికల్ కళాశాలలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జి.పుష్పం నాయక్ (23) అనే విద్యార్థి ఏలూరు ఆస్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే సోమవారం రెండో సంవత్సర ఆఖరి పరీక్ష రాసి వసతి గృహంలోని తన గదికి వెళ్లాడు. ఈ క్రమంలోనే సాయంత్రం దుప్పటితో ఉరి వేసుకొని […]
ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆస్రం మెడికల్ కళాశాలలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జి.పుష్పం నాయక్ (23) అనే విద్యార్థి ఏలూరు ఆస్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే సోమవారం రెండో సంవత్సర ఆఖరి పరీక్ష రాసి వసతి గృహంలోని తన గదికి వెళ్లాడు. ఈ క్రమంలోనే సాయంత్రం దుప్పటితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు పుష్పం నాయక్‌ను కిందకు దించి సమీపంలోని ఆస్రం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలేంటనే దానిపై ఆరా తీస్తున్నారు.