Pakistan Bus Accident: పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..23 మంది మృతి..39 మంది పరిస్థితి విషమం!
Pakistan Bus Accident: పాకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించారు. అక్కడి మీడియా నివేదికల ప్రకారం, బలూచిస్తాన్ లోని ఖుజ్దార్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ భక్తులను తీసుకెళ్తున్న బస్సు లోతైన లోయలో పడింది.
Pakistan Bus Accident: పాకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించారు. అక్కడి మీడియా నివేదికల ప్రకారం, బలూచిస్తాన్ లోని ఖుజ్దార్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ భక్తులను తీసుకెళ్తున్న బస్సు లోతైన లోయలో పడింది. దీంతో 18 మంది అక్కడికక్కడే మరణించగా, 5 మంది ఆసుపత్రిలో మరణించారు. 39 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ ఇరుకైన రహదారిపై పదునైన మలుపు తిప్పడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అతను స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయాడు దీంతో బస్సు గుంటలో పడిపోయింది.
గత వారం పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 67 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. రైలు పట్టాలు పాడైపోవడం కారణంగా ఇది జరిగింది. ఇది ఇంకా మర్చిపోక ముందే ఈ బస్సు దుర్ఘటన చోటుచేసుకుంది.
పాకిస్తాన్ పత్రిక ‘డాన్ న్యూస్’ ప్రకారం, బస్సులో భక్తులు దర్గాకు వెళుతున్నారు. ఈ సంఘటన ఖుజ్దార్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. సింధులోని దాడులోని దర్గా వద్ద బలూచిస్తాన్ లోని వాద్ ప్రాంత ప్రజలు జియారత్ కోసం వెళుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బస్సు డ్రైవర్ షార్ప్ టర్నింగ్ తీసుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రపోయారు. వారి కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, బస్సు పడిపోయిన గుంటలో నీరు కూడా ఉంది, దీంతో సహాయ కార్యక్రమాలు వేగంగా సాగలేదు.
సిబ్బందికి స్వల్ప గాయాలు
ఈ సంఘటనలో బస్సు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని బస్సు ప్రయాణికుడు చెప్పాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మార్గం చాలా కష్టం. చాలా చోట్ల పదునైన మలుపులు ఉన్నందున, బస్సును జాగ్రత్తగా నడపమని ప్రమాదానికి ముందు ప్రయాణీకులు డ్రైవర్‌ను చాలాసార్లు కోరినట్లు ఈ ప్రయాణీకుడు తెలిపారు. మరోవైపు, డ్రైవర్ ప్రమాదకరమైన రీతిలో డ్రైవింగ్ చేస్తున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో సంగీతం చాలా బిగ్గరగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరగవచ్చని చెబుతున్నారు.
Also Read: Road Accidents: 5 నెలల్లో 338 మంది.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య.. ఇది కేవలం..