బర్త్ డే..డెత్ డేగా మారింది…బీటెక్ విద్యార్థిని విషాద మరణం

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని కేబి కాలనీలో పొలం దమ్ము చేస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో బీటెక్ స్టూటెండ్ మృతి చెందింది. గౌరీగాని లక్ష్మీనారాయణ అనే రైతు వరి పంట వేసేందుకు పొలాన్ని కలియదున్నుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తనయ నవీన (22) కూడా తండ్రితో పాటు పొలానికి వచ్చింది. సందడిగా అమ్మనాన్నలతో పాటు పొలం పనులు చేస్తోంది. ఈ క్రమంలో విధి ఆమె జీవితాన్ని అంతమొందించింది. తండ్రి ట్రాక్టర్‌ను రివర్స్ తీస్తుండగా, […]

బర్త్ డే..డెత్ డేగా మారింది...బీటెక్ విద్యార్థిని విషాద మరణం
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 4:28 PM

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని కేబి కాలనీలో పొలం దమ్ము చేస్తుండగా జరిగిన యాక్సిడెంట్‌లో బీటెక్ స్టూటెండ్ మృతి చెందింది. గౌరీగాని లక్ష్మీనారాయణ అనే రైతు వరి పంట వేసేందుకు పొలాన్ని కలియదున్నుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తనయ నవీన (22) కూడా తండ్రితో పాటు పొలానికి వచ్చింది. సందడిగా అమ్మనాన్నలతో పాటు పొలం పనులు చేస్తోంది.

ఈ క్రమంలో విధి ఆమె జీవితాన్ని అంతమొందించింది. తండ్రి ట్రాక్టర్‌ను రివర్స్ తీస్తుండగా, కుదుపులకు గురై ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో నవీన ట్రాక్టర్ కింద చిక్కుకుపోయింది. పక్కనే ఉన్న రైతులు, కూలీల సాయంతో ఎంత ప్రయత్నించినా ఆ ట్రాక్టర్ పైకి లేవలేదు. బాధతో అరుస్తూ ఆమె పొలంలోనే కన్నుమూసింది. చివరకు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపి, నవీన డెడ్‌బాడీని బయటకు తీశారు. అప్పటివరకు నవ్వుతూ తిరిగిన కూతురు, విగత జీవిగా పడి ఉండటం చూసి.. ఆ అమ్మనాన్నలు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా శుక్రవారం నవీన పుట్టినరోజు కూడా కావడం స్థానికులను మరింత కలిచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.