భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న బలగాలు.. ఒడిషాలో కొనసాగుతున్న కూంబింగ్..
Odisha -BSF Jawans: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు, స్థానిక పోలీసు శాఖ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోల ప్రణాళికను రక్షణ దళాలు బట్టబయలు..
Odisha -BSF Jawans: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు, స్థానిక పోలీసు శాఖ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోల ప్రణాళికను రక్షణ దళాలు బట్టబయలు చేశాయి. కదాలిబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్ లభ్యమైంది. వీటిలో ఐదు కేజీల టిఫిన్ బాంబు, రెండు ఐఈడీ బాంబులు, మావోయిస్టుల యూనిఫాం, వైర్లు, బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టిఫిన్ బాంబు, ఐఈడీలను బీఎస్ఎఫ్ దళాలు నిర్వీర్యం చేశాయి. మావోయిస్టు డంప్ లభ్యం కావడంతో ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ భారీ డంప్ పేలి ఉంటే.. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లేదని పోలీసు అధికారులు వెల్లడించారు. మావోల కదలికల నేపథ్యంలో ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: