AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honour Killing: ప్రేమ వివాహం చేసుకుందని దారుణం .. సోదరి తల నరికి సెల్ఫీతో యువకుడి వికృతానందం..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఓ మహిళను ఆమె సోదరుడు, తల్లి దారుణంగా హతమార్చారు. కడుపుతో ఉందన్న విషయం మర్చిపోయి ఏకంగా ఆమె తలను నరికేశారు.

Honour Killing: ప్రేమ వివాహం చేసుకుందని దారుణం .. సోదరి తల నరికి సెల్ఫీతో యువకుడి వికృతానందం..
Honour Killing
Basha Shek
|

Updated on: Dec 06, 2021 | 1:47 PM

Share

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఓ మహిళను ఆమె సోదరుడు, తల్లి దారుణంగా హతమార్చారు. కడుపుతో ఉందన్న విషయం మర్చిపోయి ఏకంగా ఆమె తలను నరికేశారు. అనంతరం ఆ తలను చేతిలో పట్టుకుని ఇంటి పరిసరాల్లో అటూ ఇటూ తిరిగాడు. ఆపై తల్లీ కొడుకులిద్దరూ సెల్ఫీలు తీసుకుని వికృతానందం పొందారు. ఆపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. విరాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కీర్తిథోర్‌ (19) ఈ ఏడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ పెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. తమ అభీష్టాన్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు అప్పటి నుంచే ఆమెపై గుర్రుగా ఉన్నారు.

కాగా గతవారమే కీర్తి ఇంటికి ఆమె తల్లి వచ్చి వెళ్లింది. ఒకసారి పుట్టింటికి వచ్చి వెళ్లమని కోరింది. కాగా ఆదివారం మరోసారి తన కుమారుడితో కలిసి కూతురింటికి వచ్చింది. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న మహిళ భర్త వేరే గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా, బాధితురాలు, ఆమె అత్త పొలంలో పనులు చేసుకుంటున్నారు. తల్లి, సోదరుడు రావడం చూసి పొలం పనులు మానేసి ఇంట్లోకి వచ్చిన కీర్తి.. వారి కోసం టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ తల్లీకొడుకులు వెనకవైపు నుంచి ఆమె తలను నరికేశాడు. ఈ సమయంలో వంటింట్లో నుంచి శబ్ధం రావడంతో వేరే గదిలో ఉన్న భర్త అక్కడకు వచ్చాడు. వారు అతనిని కూడా చంపేందుకు ప్రయత్నించారు. అయితే తప్పించుకుని బయటపడ్డాడు. కాగా హత్యానంతరం నిందితుడు మహిళ తలను తీసుకుని ఇంటి వరండాలో దిగాడని, సెల్ఫీలు తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీకొడుకులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

తాడేపల్లిలో దోపిడీ దొంగల బీభత్సం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..

Road Accident: ఏపీలో రక్తమోడుతున్న రహదారులు.. అనంతపురం జిల్లాలో మరో ప్రమాదం.. ఐదుగురు అక్కడిక్కడే మృతి..

Hyderabad: బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం.. కారు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం