తాడేపల్లిలో దోపిడీ దొంగల బీభత్సం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు హైదరాబాద్ పట్టణంలో వరుస
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు హైదరాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాలు ఇప్పుడు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్నవారిపై దాడి చేసి నగదు, బంగారం దోచుకెళ్తున్నారు. దీంతో జనాలు హడలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగడాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు విల్లాలో చోరీలకు పాల్పడ్డారు. ఈ రెయిన్‌బో విల్లాలోనే ప్రముఖులు నివాసముంటున్నారు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉండే విల్లాలో చోరీ జరగడంతో కలకలం రేగుతోంది. తాడేపల్లి రెయిన్బో విల్లాస్ లో దుండగులు దొంగతనానికి ప్రయత్నించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దొంగతనాలకు పాల్పడుతూ.. అడ్డొచ్చిన వారిపై దాడి చేయడం.. కొన్ని సందర్భాల్లో దారుణంగా హత్య చేసి వెళ్లిపోతున్నారు దుండగులు. ఇటీవల తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో నవంబరు 16న ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. మరో మహిళను తీవ్రంగా గాయపరిచి బంగారం, నగదు దోచుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతుల్ని హత్యచేసి, భార్య చెవులు కోసి కమ్మలు లాక్కెళ్లారు దొంగల ముఠా. ఇటీవల టంగుటూరులో పీఎస్ కూతవేటు దూరంలోని ఓ ఇంట్లోకి రాత్రి 8గంటల ప్రాంతంలో దొంగలు చొరబడ్డారు. తల్లి, కుమార్తెల గొంతు కోసి బంగారం, నగదు చోరీ చేశారు.
Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. ప్రకటించిన జుంటా అధికార ప్రతినిధి..