Shilpa Chowdary Cheating Case: శిల్ప చౌదరి మోసాల కేసులో రోజుకో ట్విస్ట్‌.. ఇవాళ పోలీసుల ముందుకు రాధికారెడ్డి..

శిల్ప చౌదరి మోసాల కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకొస్తోంది. కీలక మలుపులు తిరుగుతోంది. ఆమె బాధితుల లిస్ట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా శిల్ప వర్సెస్‌ రాధికారెడ్డి ఇష్యూ నడుస్తోంది.

Shilpa Chowdary Cheating Case: శిల్ప చౌదరి మోసాల కేసులో రోజుకో ట్విస్ట్‌.. ఇవాళ పోలీసుల ముందుకు రాధికారెడ్డి..
Shilpa Chowdary
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 06, 2021 | 9:30 AM

Shilpa Chowdary Cheating Case: శిల్ప చౌదరి మోసాల కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకొస్తోంది. కీలక మలుపులు తిరుగుతోంది. ఆమె బాధితుల లిస్ట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా శిల్ప వర్సెస్‌ రాధికారెడ్డి ఇష్యూ నడుస్తోంది. ఇప్పటికే రెండ్రోజుల పాటు శిల్పను విచారించిన పోలీసులు. ఇవాళ రాధికారెడ్డిని విచారించనున్నారు. మరోవైపు శిల్పాచౌదరిని కూడా మరోసారి కస్టడీకీ తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఉప్పర్‌పల్లిలో కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు. అయితే రాధికారెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చానని శిల్ప చౌదరి చెబుతుంటే.. కాదు కాదు.. శిల్పనే తనను మోసం చేసిందంటోంది రాధికారెడ్డి. ఆధారాలతో సహా శిల్ప మోసాలను పోలీసుల ముందు బయటపెడతానంటోంది. దీంతో అసలేం జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిల్ప నిర్వహించిన కిట్టీ పార్టీస్‌పై ఆరా తీస్తున్నారు.

ఈమె శిల్పా చౌదరి..రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ పేరుతో దందా స్టార్ట్‌ చేసింది. ఒక్కరు..ఇద్దరు కాదు..పదుల సంఖ్యలోనే ఈమె బాధితులున్నారు. టాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈమె బాధితుల లిస్టులో ఉన్నారంటే..ఈ కిలాడీ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దివ్యారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. శిల్పా వడ్డీ వ్యాపారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు.

శిల్ప సిత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి బడా బాబుల దగ్గర కోట్లలో డబ్బులు లాగేసిందీ ఈ కిలాడి లేడి. ఫేజ్ త్రీ పార్టీలు, ఆమె విలాసవంతమైన జీవితం చూసి ఆమెను నమ్మేసిన కొందరు ప్రముఖులు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. తీరా అధిక వడ్డీ కాదు కదా..అసలు కూడా తిరిగిరాకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్స్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా వీరి బాధితుల లిస్ట్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!