Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వీటితో కలిపి గుడ్లను అస్సలు తీసుకోకండి.. ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..

షుగర్ సంబంధిత వస్తువులను గుడ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే అది మీకు విషంలా మారుతుంది. ఎందుకంటే రెండింటి నుండి వచ్చే..

Health Tips: వీటితో కలిపి గుడ్లను అస్సలు తీసుకోకండి.. ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..
Egg
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 06, 2021 | 10:53 AM

ప్రోటీన్లు, విటమిన్లు వంటి అనేక మూలకాలతో కూడిన గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఇది శరీరానికి చాలా ముఖ్యం. అందుకే దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం మంచిదని భావిస్తారు. దీనితో పాటు ఎన్నో రకాల ఎగ్ రిసిపిలు కూడా చేస్తాం. కొందరు వ్యక్తులు ఒంటరిగా గుడ్లు తినడానికి ఇష్టపడతారు, అయితే మరికొందరు మాంసం, పాల ఉత్పత్తులు, కెఫిన్ కలిగిన పానీయాలతో గుడ్లు తింటారు.

ఆయుర్వేదం ప్రకారం, తప్పు ఆహారం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపడంతో పాటు, ఇది శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. గుడ్లతో తినడానికి నిషిద్ధం ఏమిటో తెలుసుకోండి.

గుడ్డు, బేకన్

గుడ్డు, బేకన్ అటువంటి కలయికలలో ఒకటి. ఇది చాలా మంది ప్రజలు గొప్ప ఉత్సాహంతో తినడానికి ఇష్టపడతారు. మీరు అదే చేస్తే, అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రెండూ అధిక మొత్తంలో ప్రొటీన్లు, కొవ్వులో ఉంటాయి, దీని కారణంగా మీ శక్తి త్వరగా ముగిసి, మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది.

గుడ్లు , చక్కెర: షుగర్ సంబంధిత వస్తువులను గుడ్లతో కలిపి తినకూడదు. ఎందుకంటే అది మీకు విషంలా మారుతుంది. ఎందుకంటే రెండింటి నుండి వచ్చే అమైనో ఆమ్లాలు శరీరంలో రక్తంను గడ్డలను ఏర్పరుస్తాయి.

సోయా పాలు, గుడ్డు పాలు, పాల పదార్థాలతో కలిపి గుడ్లు తీసుకోకూడదు. ఎందుకంటే రెండిటిలోనూ అధిక మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. దీని వల్ల మీరు నీరసంగా అనిపించవచ్చు. రాబోయే రోజుల్లో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంది.

పండ్లతో..  ఆరోగ్యానికి పండ్లు చాలా మంచి భావిస్తారు. అయితే గుడ్లతో కలిపి తినకూడదు. దీని వల్ల మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!