Tea: టీ తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రమాదంలో పడినట్టే..
సాధారణంగా చాలా మంది తమ రోజూను మొదటగా కప్పు టీతో ప్రారంభిస్తారు. ఉదయం లేవగానే కచ్చితంగా చాయ్ తాగేవారు
సాధారణంగా చాలా మంది తమ రోజూను మొదటగా కప్పు టీతో ప్రారంభిస్తారు. ఉదయం లేవగానే కచ్చితంగా చాయ్ తాగేవారు అధికం. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం టీని తాగుతుంటారు. అలాగే అలసటను తగ్గించడమే కాకుండా.. శరీరానికి వెచ్చదనం ఇచ్చేందుకు కూడా టీ ఉపయోగపడతుంది. టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. టీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. గుండె వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులను నియంత్రిస్తుంది. అయితే ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే టీతో కొన్ని సందర్భాల్లో హానికరంగా మారుతుంది. అలాగే టీతోపాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం అదేంటో తెలుసుకుందమా..
టీ తాగేటప్పుడు ఈ పదార్థాలను తీసుకుంటే ప్రమాదం. అలాగే టీ తాగడానికి ముందు గానీ.. తాగిన తర్వాత గానీ ఆహార పదార్థాలను తీసుకోవద్దు. టీ తాగడానికి ముందు కానీ.. ఆ తర్వాత కానీ.. ఆకుకూరల్ని , పచ్చి కూరగాయాలను అస్సలు తీసుకోవద్దు. పచ్చి కూరలో ఉండే గోయిట్రోజన్లు ఇబ్బంది కలిగిస్తాయి. దీనివలన ఐయోడిన్ లోపం కలుగుతుంది. అలాగే బ్రోకలీని కూడా అస్సలు తీసుకోవద్దు. టీ తాగేసమయంలో బ్రోకలీని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మంచివి. ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. బరువు తగ్గించడంలోనూ సహాయపడతాయి. ఇందులో ఫైటేట్ ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలు తీసుకున్న వెంటనే టీ తాగకూడదు. వీటితోపాటు టీ తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిమ్మకాయ వేసిన టీని ఉదయాన్నే అస్సలు తీసుకోవద్దు. అలాగే టీ తాగిన వెంటనే నిమ్మకాయ నీటిని తాగకూడదు. పెరుగు, టీ కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగుతాయి. శనగపిండితో చేసిన స్నాక్స్ అస్సలు టీ తాగుతున్నప్పుడు తీసుకోవద్దు. వీటి వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ఇక టీకి… చల్లని పదార్థాలు.. అంటే ఐస్ క్రీమ్ వంటి వాటికి కనీసం గంట వ్యత్యాసం ఉండాలి.
Also Read: Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన ప్రియాంక.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..